Katrina Kaif : ఈ మధ్య స్టార్ హీరోయిన్లు చాలా మంది గుడ్ న్యూస్ చెబుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ గుడ్ న్యూస్ చెప్పింది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాత్రి కత్రినా స్వయంగా పోస్టు చేసి చెప్పింది. కత్రినా తన బేబీ బంప్ ఫొటోలను పంచుకుంది. ‘ఆనందం నిండిన హృదయాలతో మా జీవితంలో కొత్త చాప్టర్ ను ఆహ్వానిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చింది ఈ బ్యూటీ. 2021లో వీరిద్దరూ పెళ్లి చేసుకోగా.. ఇన్నేళ్ల తర్వాత వీరు ఈ గుడ్ న్యూస్ చెప్పారు.
Read Also : Arjun Das : విలన్‌గా దుమ్ములేపుతున్న అర్జున్ దాస్ ..బాలీవుడ్ ఎంట్రీ
విక్కీ, కత్రినాది లవ్ మ్యారేజ్. విక్కీ కంటే కత్రినా వయసులో పెద్దది. అయినా సరే ఇద్దరూ కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కత్రినా 20 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తోంది. విక్కీ కౌశల్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. చావా సినిమాతో స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. ప్రస్తుతం కత్రినా, విక్కీ తమ జీవితంలోకి తొలి బేబీని ఆహ్వానిస్తున్నారు. కత్రినా తెలుగులో మల్లీశ్వరి సినిమాలో నటించగా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Read Also : Saiyaara: ‘సైయారా’ హిట్ తో 200 మంది కష్టం వృధా – అనుపమ్ ఖేర్
