కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఖైదీ’ చిత్రంతో ఫేమస్ అవ్వగా.. అతడి వాయిస్ కు సెపరెట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ ఉంది. రీసెంట్ గా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కూడా అర్జున్ వాయిస్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నటుడిగా కొనసాగుతూ, వాయిస్ ఓవర్ ద్వారా మరింత గుర్తింపు పొందుతున్న అర్జున్, టాలీవుడ్ టూ.. కోలివుడ్ బిజీ అయ్యాడు.
Also Read : Amruta Rao : ఈ మూవీ హిట్ తర్వాత నా జీవితంలో చాలా జరిగాయి.. అంటున్న మహేశ్ బ్యూటీ
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ లో కీలక పాత్ర పోషిస్తుండగా, తాజాగా బాలీవుడ్‌లో ‘డాన్ 3’ మూవీలో అర్జున్ దాస్ ఎంట్రీ ఇస్తున్నాడట. రణవీర్ సింగ్ కథానాయకుడిగా, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో, డిసెంబర్ లేదా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. అర్జున్ డాన్ 3లో విలన్‌గా ఎంపికైనట్లు తెలిసింది. ఖైదీ, విక్రమ్, మాస్టర్ లోని పాత్రలు చూస్తే, దర్శకుడు పర్హాన్ తన రాసిన విలన్ పాత్రకు అర్జున్‌ను పర్ఫెక్ట్ అనిపించి తీసుకున్నాడట. ఇప్పటికే ప్రియాంక చోప్రా, కియారా అద్వానీ వంటి గ్లోబల్ బ్యూటీ లు కూడా ఈ భారీ యాక్షన్ చిత్రంలో భాగం కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 1978లో డాన్ మొదటి చిత్రం, 2011లో డాన్ 2 రిలీజ్ అయింది, ఇక ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత ‘డాన్ 3’ పట్టాలెక్కుతోంది.