పెళ్ళికి ముందు కత్రినా, విక్కీ కోర్టు మ్యారేజ్… ఇలా ఎందుకో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చినప్పటికీ వారు స్పందించలేదు. రాజస్థాన్‌లో వారి రాయల్ వివాహ ఆచారాలకు ముందే విక్కీ, కత్రినా ముంబైలో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. రణతంబోర్ సమీపంలోని రిసార్ట్‌లో తమ రాజరిక వివాహం కోసం జైపూర్‌కు వెళ్లే ముందు… విక్కీ, కత్రినా వచ్చే వారం ముంబైలో కోర్టు వివాహం చేసుకుంటారని కత్రినా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రాజస్థాన్‌లో రెండు వివాహ వేడుకలు ప్లాన్ చేశారట. కత్రినా, విక్కీ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటున్నారట. అందుకనే ఇంకా పెళ్లి విషయాన్నీ కూడా అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. ప్రస్తుతం కత్రినా సినిమాల నుండి విరామం తీసుకుంది. ముంబైలో విక్కీతో కోర్టు వివాహం చేసుకోనుంది. అయితే కోర్టు వివాహం అంటే ఏంటి? అసలు కోర్టు వివాహం ఎందుకు చేసుకుంటారు? కోర్టు మ్యారేజ్ కు రిజిస్టర్ మ్యారేజ్ కు మధ్య తేడా ఏంటి? అంటే….
Read Also : రివ్యూ: దృశ్యం – 2
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కోర్టు మ్యారేజ్ అంటే ఏంటి? ఎందుకు?
కోర్ట్ మ్యారేజ్ అంటే తమ కులం లేదా మతానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా వివాహం చేసుకోవడానికి అర్హులైన మగ, ఆడ జంట మధ్య వివాహాన్ని కోర్టు, వివాహ అధికారి (రిజిస్ట్రార్/మేజిస్ట్రేట్), ముగ్గురు సాక్షుల సమక్షంలో జరుపుకోవడం. పెళ్లి చేసుకునే జంట న్యాయవాది సహాయంతో కోర్టు వివాహం చేసుకుంటారు. కోర్టు వివాహానికి అర్హత వధువు వయస్సు కనీసం 18 సంవత్సరాలు, వరుడి వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి. వివాహ సమయంలో ఇద్దరూ ఎలాంటి మానసిక రుగ్మతతో బాధపడకూడదు. భారత సర్వోన్నత న్యాయస్థానం 2006లో చట్టం దృష్టిలో అన్ని వివాహాలను నమోదు చేయడాన్ని తప్పనిసరి చేసింది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని నిరూపించడానికి ఇది ముఖ్యమైన ధృవీకరణ పత్రంగా మారింది. అంటే చట్టపరమైన భద్రత ఉంటుంది. అయితే విడాకులు తీసుకోవడం మాత్రం కష్టం.
కోర్టు మ్యారేజ్ కు రిజిస్టర్ మ్యారేజ్ కు మధ్య తేడా ?
సంప్రదాయ వివాహం తర్వాత వివాహ ధృవీకరణ పత్రం పొందడానికి, జంటలు చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించి రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ వివాహాన్ని నమోదు చేసుకోవాలి. దీన్నే రిజిస్టర్ మ్యారేజ్ అంటారు. వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నట్లు తెలిపే అధికారిక సాక్ష్యం. కోర్టు వివాహంలో అర్హులైన ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు సాక్షుల సమక్షంలో ఒకరినొకరు వివాహం చేసుకోవచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా భారతీయ పౌరులుగా ఉండాలనేది కూడా తప్పనిసరి కాదు. ఒక భారతీయ వ్యక్తి, ఒక విదేశీ వ్యక్తి కూడా ఉండవచ్చు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!