Kasthuri: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు.. ఎలాంటి పాత్ర చేస్తారో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు కొన్ని పాత్రలకు అనుకున్నవారిని వేరే పాత్రలకు తీసుకుంటారు. ఆడిషన్స్ లో ఎంత చేసినా.. డైరెక్టర్ ఏ పాత్రకు ఎవరిని పెట్టాలో వారినే పెడతాడు. ఇక తాజగా నటి కస్తూరి.. తాను కోరుకున్న పాత్ర డైరెక్టర్ ఇవ్వలేదని చాలా నిరాశచెందినట్లు చెప్పుకొచ్చింది. కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ లేడీ. ప్రస్తుతం ఇంటింటి గృహాలక్ష్మీ సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటే భారతీయుడు అనే చెప్పాలి. పచ్చని చిలుకలు తోడుంటే సాంగ్ లో కస్తూరి నటన వేరే లెవెల్ ఉంటుంది. ఆ సినిమాతోనే ఆమెకు బాగా పేరు వచ్చింది. అయితే ఈ సినిమాలో కమల్ సరసన హీరోయిన్ గా చేయడం కోసమే తాను ఆడిషన్స్ కు వెళ్లానని.. చివరికి డైరెక్టర్ తనకు చెల్లెలి పాత్ర ఇచ్చి నిరాశపరిచినట్లు చెప్పుకొచ్చింది.
Akkineni Nagarjuna: వస్తున్నాం.. కొడుతున్నాం అనడమేనా.. వచ్చేది ఏమైనా ఉందా.. ?
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి మాట్లాడుతూ.. “భారతీయుడు సినిమా కోసం మొదట నన్ను ఆడిషన్ చేశారు. శంకర్ సినిమా అనగానే నాకు చాలా ఆనందం వేసింది. ఎలాగైనా ఈ అవకాశం దక్కించుకోవాలని ఆడిషన్ అయ్యాకా.. శంకర్ సార్ కు పర్సనల్ గా నా బికినీ ఫోటోలు పంపాను. ఆయన ఇంప్రెస్ అవుతారని అనుకున్నాను. ఎలాగైనా నేనే హీరోయిన్ అవ్వాలనుకున్నా. అయితే అదే సమయంలో రంగీలా సినిమా రిలీజ్ అయ్యి.. ఊర్మిళ బికినీ ఫోటోలు సెన్సేషన్ అయ్యాయి. ఇక అందరూ ఆమె వైపే చూడడం మొదలుపెట్టారు. చివరికి శంకర్ సార్ కూడా.. ఊర్మిళనే హీరోయిన్ గా తీసుకున్నారు. నాకేమో చెల్లెలి రోల్ ఇచ్చారు. అలా నేను ఆ పాత్ర వలన చాలా నిరాశచెందాను. కొన్ని రోజుల తర్వాత శంకర్ గారిని చెల్లి పాత్ర ఇచ్చారేంటి అని అడిగితే.. కథలో ఈ పాత్రే చాలా కీలకం అని చెప్పి మాట దాటేశారు” అని చెప్పుకొచ్చింది. అలా కమల్ తో రొమాన్స్ చేయాల్సిన కస్తూరి చెల్లిగా మారింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.