Thandel: అనుకున్నదే చెప్పారు.. రిలీజ్ ఎప్పుడంటే?
- ఎట్టకేలకు తండేల్ రిలీజ్ డేట్ చెప్పేశారు
- ముందు నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం
- ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thandel: నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు గుజరాత్ లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ నేవీ చేతులకు చిక్కి జైలు శిక్ష అనుభవిస్తారు. ఆ తర్వాత ఆ జాలర్ల బృందం తిరిగి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చింది? ఎలా తిరిగి వచ్చింది? వంటి అంశాలను ఈ సినిమాలో ఆసక్తికరంగా తెరకెక్కించారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆ జాలర్లలో చిక్కుకుపోయిన ఒక యువకుడే ఈ సినిమాకి కథ అందించడం గమనార్హం.
Also Read: Aishwarya: ఐశ్వర్యను ఒంటరిగా వదిలివేసి.. ఆమె పక్కన కూర్చున్న అభిషేక్?
Also Read
కార్తీక్ అనే యువకుడు అందించిన ఈ కథను చందు మొండేటి దర్శకత్వంలో తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు గీతా ఆర్ట్స్ ముందుకొచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. తొలుత డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఆ డేట్ కి షూటింగ్ పూర్తి కాకపోవచ్చు అనే ఉద్దేశంతో తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు ఈ సినిమాని ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ డేట్ రిలీజ్ అవుతుందని ముందు నుంచే సోషల్ మీడియాలో లీక్స్ వచ్చాయి ఆ లీక్స్ నిజం చేస్తూనే ఇప్పుడు సినిమా యూనిట్ కూడా అధికారికంగా సినిమా డేట్ ని ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
తాజావార్తలు
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!