Kasthuri Shankar: గంటకు ఐదు వేలు వస్తాయ్.. నీకెందుకు బిగ్ బాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kasthuri Shankar: సీనియర్ నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దరికం, భారతీయుడు లాంటి సినిమాలతో ఆమె ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. అన్ని భాషల్లోమంచి సినిమాలు చేసిన కస్తూరి ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో గృహలక్ష్మి అనే సీరియల్ తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన కస్తూరి ట్విట్టర్లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ రాజకీయంగా, వ్యక్తిగతంగా తనదైన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో బిగ్ బాస్ మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో నెల రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. తమిళ్లో మూడు రోజుల క్రితమే మొదలైంది. తమిళ్ లో బాగా ఫేమస్ అయిన సెలబ్రిటీలను హౌస్ లోకి పంపించాడు కమల్ హాసన్. ఇక బిగ్ బాస్ షో పై కస్తూరి ట్విట్టర్ లో తనదైన అభిప్రాయం చెప్పుకొచ్చింది.
Prema Vimanam Trailer: ఇదేదో.. విమానం సినిమాకు సీక్వెల్ లా ఉందే..?
Also Read
బిగ్ బాస్ చూస్తారా అన్న నెటిజన్ ప్రశ్నకు.. ” లేదు.. నేను అసలు పట్టించుకోను.. ఒక ఇంట్లో చాలామందిని ఉంచి ఆర్టిఫిషియల్ ఫీలింగ్స్ చూపించే షో గురించి నేను అసలు పట్టించుకోను. నా దగ్గర టీవీ లేదు.. నాకు అంత టైమ్ లేదు. ఓపిక, ఇంట్రెస్ట్ కూడా లేవు. నాకు ఒక కుటుంబం ఉంది.. దాని బాధ్యతలు ఉన్నాయి.. వర్క్స్ ఉన్నాయి” అంటూ రాసుకొచ్చింది. ఇక కస్తూరి ట్వీట్ పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.ఒకరేమో మీరు చాలా షోస్ కు వెళ్లారు కదా.. ఇది కూడా ఒక షోనే కదా అని చెప్పుకొచ్చారు. ఇంకొందరు డబ్బుల కోసం ఏ షోస్ కైనా వెళ్తారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక నెటిజన్ మాత్రం అదుపుతప్పి మాట్లాడాడు. “అవునులే నీకు గంటకు రూ.5000 వస్తాయి కదా.. నువ్వేం వెళతావ్” అని అడగ్గా కస్తూరి ఆ ట్వీట్ పై ఫైర్ అయింది. “మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలానే పెంచారా నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుంది అంటూ విరుచుకుపడింది”. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
India’s Nuclear Arsenal: భారత్ వద్ద 190 అణు వార్హెడ్లు? FAS నివేదికలో సంచలన వివరాలు
-
Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో తొలి వ్యక్తిగత ‘స్వర్ణం’ కైవసం.!
-
IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
-
Tirupati – Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
-
iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?