బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, తెలుగు బ్యూటీ శ్రీ లీల ల మధ్య డేటింగ్ పుకార్లు గత కొంతకాలంగా చర్చనీయాంశం మారిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ డ్రామాలో నటిస్తుండగా, ఆఫ్‌స్క్రీన్ కెమిస్ట్రీ విషయంలోనూ హాట్ టాపిక్‌గా మారిపోయారు. అయితే తాజాగా ముంబైలోని కార్తీక్ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలో శ్రీ లీల కుటుంబం ప్రత్యేక అతిథులుగా హాజరైంది. ఇరు కుటుంబాలు కలిసి పండుగ జరుపుకోవడం, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇప్పుడు బాలీవుడ్–టాలీవుడ్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
Also Read : OG : 117 ఆర్టిస్టులతో బీజీఎం.. తమన్ మ్యూజికల్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో జోష్
తెల్లటి దుస్తుల్లో జంట కవల లాగా కనిపించడం, ఒక ఫోటోలో శ్రీ లీల తల్లి–కార్తీక్ పక్కన ఉండగా, మరో ఫోటో లో కార్తీక్ తల్లి–శ్రీ లీల పక్కన నిలబడి ఉండడం అభిమానుల్లో ఆసక్తి రేపింది. ఇక మార్చిలో జరిగిన ఐఫా అవార్డ్స్ వేడుక లో కార్తీక్ తల్లి మాల తివారీ చేసిన వ్యాఖ్యలు కూడా మళ్లీ చర్చకు వచ్చాయి. “నా కొడుకుకు కోడలు ఒక మంచి డాక్టర్ కావాలి” అని చెప్పిన ఆమె మాటలు, ఇప్పటికే డాక్టర్ అయిన శ్రీ లీలకు సరిపోతున్నాయన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఇప్పటివరకు ఈ రూమర్స్‌పై కార్తీక్ గానీ, శ్రీలీల గానీ స్పందించలేదు. కానీ వరుసగా ఫ్యామిలీ ఈవెంట్స్‌లో కలిసి కనిపించడం వల్ల వారి మధ్య ఏదో స్పెషల్ బాండ్ ఉందనే అనుమానాలు మరింత రాజుకుంటున్నాయి.