NTV Telugu Site icon

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ సెకండ్ పార్ట్ ఉందా? అందుకే అలా ముగిసిందా?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: ఎట్టకేలకు కార్తీక దీపం సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడింది. అయితే ఈ సీరియల్‌ను ముగించిన తీరు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. గతంలో సెకండ్ జనరేషన్‌ను చూపించిన నిర్వాహకులు మళ్లీ సీరియల్‌ను గతంలోకి తీసుకెళ్లారు. కానీ ఎండ్ కార్డ్ వేసేటప్పుడు సెకండ్ జనరేషన్‌ను చూపించకుండా ముగించారు. దీంతో పలు ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. దీంతో మెగా సీరియల్ అసంతృప్తిగా ముగిసిందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అంత ఆదరాబాదరగా సీరియల్ ముగించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. అలాంటప్పుడు సెకండ్ జనరేషన్‌లో మానస్, కీర్తి భట్ లాంటి పాత్రలను ఎందుకు చూపించారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అయితే మోనితను దీప కాల్చిన తర్వాత కారులో కార్తీక్‌తో కలిసి వెళ్తుంది. అయితే ఓ చోట ఆగమని చెప్తుంది. తాను చనిపోయేలోపు ఏడు అడుగులు నడవాలని భర్తతో అంటుంది. దీంతో కారు ఆపి ఏడు అడుగులు నడుస్తారు. ఇంతలో కారు పేలిపోతుంది. మోనిత కారులో బాంబు పెట్టిందని తెలుస్తుంది. చివరకు కార్తీక్, దీప ప్రేమతో మాట్లాడుకుని వెళ్లిపోతారు. దీంతో మళ్లీ కలుద్దాం అని ఎండ్ కార్డ్ వేశారు.

కానీ గతంలో కార్తీక్, దీప కారు ప్రమాదంలో చనిపోయారని చూపించిన తర్వాత సీరియల్‌లో సెకండ్ జనరేషన్‌ను ప్రారంభించారు. శౌర్యను ఆటో డ్రైవర్‌లా, హిమను డాక్టర్‌లా పరిచయం చేశారు. వీళ్లిద్దరూ బిగ్‌బాస్ ఫేం మానస్‌ను ప్రేమించడం కూడా చూపించారు. అయితే ఉన్నట్టుండి ఆటోడ్రైవర్ వారణాసి శౌర్య, హిమ దగ్గరకు వచ్చి కార్తీక్, దీప బతికే ఉన్నారని చెప్తూ ఫ్లాష్‌బ్యాక్ ప్రారంభిస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ రీ ఎంట్రీ లేకుండా సీరియల్ ఎలా ముగిస్తారని ప్రేక్షకులు మండిపడుతున్నారు. అయితే కొందరు కార్తీకదీపం సీరియల్‌కు సెకండ్ పార్ట్ ఉందని.. అందుకే ఇలా ముగించారని చర్చించుకుంటున్నారు. కాగా కార్తీక దీపం సీరియల్ స్థానంలో బ్రహ్మముడి అనే ధారావాహికను స్టార్ మా ఛానల్ ప్రారంభించింది.

Show comments