NTV Telugu Site icon

Karthik Subbaraj: ఈ దీపావళికి బాంబుల మోతనే…

Karthik Subbaraj

Karthik Subbaraj

కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో టాప్ 5లో ఉంటాడు కార్తీక్ సుబ్బరాజ్. యాక్షన్, గ్యాంగ్ స్టర్ డ్రామాలని ఎక్కువగా చేసే కార్తీక్ సుబ్బరాజ్ ‘పిజ్జా’, ‘జిగార్తండ’ లాంటి సినిమలతో కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రజినీకాంత్ తో ‘పేట’ సినిమా చేసి, ఒక ఫ్యాన్ గా ఇతర రజినీ ఫాన్స్ కి పర్ఫెక్ట్  సినిమా ఇచ్చాడు. రీసెంట్ గా మహాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కార్తీక్ సుబ్బరాజ్ లేటెస్ట్ మూవీ ‘జిగార్తండ డబుల్ X. గతంలో వచ్చిన జిగార్తండ సినిమాకి సీక్వెల్ గా కాకుండా కొత్త కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. రాఘవ లారెన్స్, ఎస్జే సూర్యలు జిగార్తండ డబుల్ X సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దీపావళి ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ గ్లిమ్ప్ ని వదిలారు. ఇందులో నైట్ ఎఫెక్ట్ లో థియేటర్ ముందు ఫైర్ షాట్ విజువల్ ని కార్తీక్ సుబ్బరాజు చాలా బాగా చూపించడు. తన మార్క్ మేకింగ్ తో తెరకెక్కుతున్న ‘జిగార్తండ డబుల్ X’ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఫేస్ చేస్తుందో చూడాలి.

Read Also: Vaishnav Tej: ‘రుద్ర కాళేశ్వర రెడ్డి’గా మారిన మెగా మేనల్లుడు… మాములుగా లేడుగా

Show comments