Bollywood: నాలుగేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బాలీవుడ్ ప్రేమ జంట…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు ప్రేమ పెళ్లి అయిపోయి 24 గంటలు కూడా గడవక ముందే మరో బాలీవుడ్ ప్రేమజంట కలిసి కనిపించారు. బాలీవుడ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ లు నాలుగేళ్ల క్రితం ‘లవ్ ఆజ్ కల్’ సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో సారా, కార్తీక్ ఆర్యన్ లు రిలేషన్షిప్ లోకి వెళ్లారు అనే టాక్ బీటౌన్ లో వినిపించింది. దీంతో బాలీవుడ్ లో సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ లు హాట్ టాపిక్ అయ్యారు. ఈ మూవీ తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు కానీ ప్రేమ వార్తలు మాత్రం ఆగలేదు. కార్తీక్ ఆర్యన్ స్వయంగా తాను రిలేషన్ లో లేనని, సారా తన ఫ్రెండ్ మాత్రమే అని ఓపెన్ గానే చెప్పాడు కానీ ఎవరూ నమ్మలేదు.
కార్తీక్ ఆర్యన్ ఈ మాట చెప్పిన తర్వాత సారాతో కలిసి వెకేషన్ కి వెళ్లడంతో ‘వీ ఆర్ జస్ట్ ఫ్రండ్స్’ అనే మాటని అందరూ కొట్టి పడేశారు. ఈ వార్తలు ఎక్కువ అయ్యాయి అనో లేక ఎవరి కెరీర్స్ లో వాళ్లు బిజీగా ఉన్నారో తెలియదు కానీ సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ కలిసి కనిపించడం మానేసారు. మళ్లీ ఇప్పుడు సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ ఉదైపూర్ లో కలిసి కనిపించారు. ఈ సమయంలో పాపరాజ్జి తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మళ్లీ ప్రేమ వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం #sartik అనే ట్యాగ్ ని ట్రెండ్ క్రియేట్ చేసి మరీ ఒక రేంజులో ట్వీట్స్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఈ జంట రిలేషన్ లో ఉన్నారా? లేదా? అంటే ఏమో గుర్రం ఎగరావచ్చు అంటున్నారు బీటౌన్ వర్గాలు.
Also Read
తాజావార్తలు
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్‌కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
-
Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ దోశ తింటే చాలు!
-
Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
-
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!