NTV Telugu Site icon

Karthi : ఆరు సినిమాలతో క్రేజీ లైనప్ సెట్ చేస్తున్న యంగ్ హీరో..

Karti

Karti

పొన్నియన్ సెల్వన్ సిరీస్, సర్దార్, మెయ్యాలగన్ హిట్లతో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. మధ్యలో జపాన్, కంగువా ఫెయిల్యూర్ అయినా కెరీర్, మార్కెట్‌పై పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. ఏడాదికి మినిమం రెండు సినిమాలను దింపేస్తోన్న ఈ టాలెంటెడ్ హీరో.. ఈ ఏడాది కూడా టూ ఫిల్మ్స్ రెడీ చేసేశాడు. నలన్ కుమార స్వామి దర్శకత్వంలో వా వాతియార్‍తో పాటు పీఎస్ మిథున్ డైరెక్షన్‌లో సర్దార్ 2 కంప్లీట్ చేశాడు. ఇవే కాకుండా మరో రెండు సినిమాలను సెట్ చేసేశాడు.

Also Read : SSMB 29 : అట్లుంటది రాజమౌళితోని.!

లైనప్ విషయంలో అన్న సూర్యను ఓవర్ టేక్ చేస్తున్నాడు కార్తీ. డైరెక్టర్ తమిళ్‌తో 29th ఫిల్మ్‌కు కమిటైన ఈ వర్సటైల్ యాక్టర్ ఖైదీ సీక్వెల్ కోసం కూడా బీ రెడీ అంటున్నాడు. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ నుండి వస్తోన్న ఖైదీ2 ప్రాజెక్టులోకి త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని కొత్త కథలను, స్టార్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్నాడు ఈ స్టార్ హీరో. రీసెంట్లీ గౌతమ్ వాసు దేవ్ మీనన్ చెప్పిన నేరేషన్‌కు ఇంప్రెస్ అయ్యాడట కార్తీ. ఫుల్ స్టోరీ ప్రిపేర్ చేసుకు వస్తే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇద్దామన్న యోచనలో ఉన్నాడని తెలుస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఖాకీ సీక్వెల్ కూడా అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో ఉండబోతుందని సమాచారం. అలాగే పా రంజిత్, మారి సెల్వరాజ్, సుందరి సి, శివ లాంటి డైరెక్టర్లు కూడా కార్తీతో వర్క్ చేసేందుకు క్యూలో ఉన్నారని కోలీవుడ్‌ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. ప్రజెంట్ కమిటైన ప్రాజెక్టులు, దర్శకులను చూస్తుంటే మరో రెండు, మూడేళ్లు కొత్త కాల్షీట్స్ ఇవ్వలేనంత బిజీగా లైనప్ కనిపిస్తోంది.