Kareena Kapoor Birthday : కరీనా కపూర్ బహుముఖ ప్రజ్ఞ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కపూర్ ఖాన్ – ఈ పేరు ఇప్పటికీ కుర్రాళ్ళ గుండెల్లో సరిగమలు పలికిస్తోంది. కపూర్ ఖాన్ దాన్ నాయికల్లో కరీనా స్థాయిలో అందంతో అలరించిన క్రెడిట్ కూడా ఆమెకే దక్కుతుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన కరీనా ఇప్పటికీ ఆకట్టుకుంటూ ఉండడమే విశేషం!
కరీనా కపూర్ 1980 సెప్టెంబర్ 21న జన్మించింది. రాజ్ కపూర్ పెద్ద కొడుకు రణదీర్ కపూర్, నటి బబిత ఆమె కన్నవారు. తాతల నాటి నుంచీ పేరుకు పోయిన నటనతో కరీనా కపూర్ పరుగులు తీస్తూ చిత్రసీమలో అడుగు పెట్టింది. అభిషేక్ బచ్చన్ తొలి చిత్రం ‘రెఫ్యూజీ’తోనే కరీనా సైతం చిత్రసీమలో అడుగుపెట్టడం విశేషం. ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. షారుఖ్ ఖాన్ చారిత్రక చిత్రం ‘అశోక’లో కీలక పాత్ర పోషించినా, ఆ సినిమా సైతం చేదురుచినే చూపించింది. కరీనా పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో ‘కభీ ఖుషి కభీ ఘమ్’ ఆమె అందానికి తగ్గ విజయాన్ని అందించింది. ఆ తరువాత నుంచీ కరీనా కపూర్ కాల్ షీట్స్ కు డిమాండ్ పెరిగింది. ‘ఛమేలీ’లో వేశ్య పాత్రలో కరీనా అభినయం అందరినీ ఆకట్టుకుంది. గోవింద్ నిహలానీ ‘దేవ్’లోనూ మంచి మార్కులే సంపాదించింది. “ఓంకార, జబ్ వీ మెట్, కుర్బాన్, వీ ఆర్ ఫ్యామిలీ, ఉడ్తా పంజాబ్” వంటి చిత్రాలతో నటిగా జేజేలు అందుకుంది. ఇక ఆమిర్ ఖాన్ తో నటించిన ‘3 ఇడియట్స్’, సల్మాన్ ఖాన్ సరసన అలరించిన “బాడీ గార్డ్, బజ్రంగీ భాయిజాన్” చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
షాహిద్ కపూర్ హిట్ పెయిర్ గా పేరు సంపాదించింది కరీనా. వారిద్దరూ కలసి నటించిన “ఫిదా, 36 చీనా టౌన్, జబ్ వీ మెట్, చుప్ చాప్ కే” వంటి చిత్రాలలో నటించారు. కరీనా, షాహిద్ ప్రేమయాత్ర పెళ్ళి దాకా వెళ్తుందని భావించారు. అయితే అనూహ్యంగా పటౌడీ వారి అబ్బాయి సైఫ్ అలీ ఖాన్ రెండో భార్యగా కరీనా కపూర్ మారింది.
Also Read
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
‘దేవ్’లో “జబ్ నహీ ఆయే థే తుమ్…” పాట పాడి అలరించింది కరీనా. ‘తషాన్’లోనూ గాయనిగా మురిపించింది. షారుఖ్ ఖాన్ ‘డాన్’, ‘క్యా లవ్ స్టోరీ హై’, ‘రౌడీ రాథోడ్’లో “జింతాతా జితా తా…” , ‘దబంఘ్-2’లో “ఫెవికాల్…” సాంగ్స్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది.
నటనతో పాటు రచనలోనూ కరీనా కపూర్ చేయి చేసుకుంది. ఆమె రాసిన న్యూట్రిషన్ గైడ్స్ జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. స్టేజ్ షోస్ తోనూ కరీనా అలరించారు. రేడియోలో ఓ కార్యక్రమానికి హోస్ట్ గానూ ఆమె వ్యవహరించారు. బాలికలకు సముచిత విద్య కోసం ‘యూనిసెఫ్’తో కలసి పనిచేస్తున్నారు. ఆమిర్ ఖాన్ తో ఆమె నటించిన ‘లాల్ సింగ్ ఛద్దా’ ఈ మధ్యే విడుదలై పరాజయం పాలయింది. భవిష్యత్ లో కరీనా మరిన్ని చిత్రాలతో జనాన్ని ఆకట్టుకుంటారని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!