Kareena Kapoor Birthday : కరీనా కపూర్ బహుముఖ ప్రజ్ఞ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కపూర్ ఖాన్ – ఈ పేరు ఇప్పటికీ కుర్రాళ్ళ గుండెల్లో సరిగమలు పలికిస్తోంది. కపూర్ ఖాన్ దాన్ నాయికల్లో కరీనా స్థాయిలో అందంతో అలరించిన క్రెడిట్ కూడా ఆమెకే దక్కుతుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన కరీనా ఇప్పటికీ ఆకట్టుకుంటూ ఉండడమే విశేషం!
కరీనా కపూర్ 1980 సెప్టెంబర్ 21న జన్మించింది. రాజ్ కపూర్ పెద్ద కొడుకు రణదీర్ కపూర్, నటి బబిత ఆమె కన్నవారు. తాతల నాటి నుంచీ పేరుకు పోయిన నటనతో కరీనా కపూర్ పరుగులు తీస్తూ చిత్రసీమలో అడుగు పెట్టింది. అభిషేక్ బచ్చన్ తొలి చిత్రం ‘రెఫ్యూజీ’తోనే కరీనా సైతం చిత్రసీమలో అడుగుపెట్టడం విశేషం. ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. షారుఖ్ ఖాన్ చారిత్రక చిత్రం ‘అశోక’లో కీలక పాత్ర పోషించినా, ఆ సినిమా సైతం చేదురుచినే చూపించింది. కరీనా పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో ‘కభీ ఖుషి కభీ ఘమ్’ ఆమె అందానికి తగ్గ విజయాన్ని అందించింది. ఆ తరువాత నుంచీ కరీనా కపూర్ కాల్ షీట్స్ కు డిమాండ్ పెరిగింది. ‘ఛమేలీ’లో వేశ్య పాత్రలో కరీనా అభినయం అందరినీ ఆకట్టుకుంది. గోవింద్ నిహలానీ ‘దేవ్’లోనూ మంచి మార్కులే సంపాదించింది. “ఓంకార, జబ్ వీ మెట్, కుర్బాన్, వీ ఆర్ ఫ్యామిలీ, ఉడ్తా పంజాబ్” వంటి చిత్రాలతో నటిగా జేజేలు అందుకుంది. ఇక ఆమిర్ ఖాన్ తో నటించిన ‘3 ఇడియట్స్’, సల్మాన్ ఖాన్ సరసన అలరించిన “బాడీ గార్డ్, బజ్రంగీ భాయిజాన్” చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
షాహిద్ కపూర్ హిట్ పెయిర్ గా పేరు సంపాదించింది కరీనా. వారిద్దరూ కలసి నటించిన “ఫిదా, 36 చీనా టౌన్, జబ్ వీ మెట్, చుప్ చాప్ కే” వంటి చిత్రాలలో నటించారు. కరీనా, షాహిద్ ప్రేమయాత్ర పెళ్ళి దాకా వెళ్తుందని భావించారు. అయితే అనూహ్యంగా పటౌడీ వారి అబ్బాయి సైఫ్ అలీ ఖాన్ రెండో భార్యగా కరీనా కపూర్ మారింది.
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
‘దేవ్’లో “జబ్ నహీ ఆయే థే తుమ్…” పాట పాడి అలరించింది కరీనా. ‘తషాన్’లోనూ గాయనిగా మురిపించింది. షారుఖ్ ఖాన్ ‘డాన్’, ‘క్యా లవ్ స్టోరీ హై’, ‘రౌడీ రాథోడ్’లో “జింతాతా జితా తా…” , ‘దబంఘ్-2’లో “ఫెవికాల్…” సాంగ్స్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది.
నటనతో పాటు రచనలోనూ కరీనా కపూర్ చేయి చేసుకుంది. ఆమె రాసిన న్యూట్రిషన్ గైడ్స్ జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. స్టేజ్ షోస్ తోనూ కరీనా అలరించారు. రేడియోలో ఓ కార్యక్రమానికి హోస్ట్ గానూ ఆమె వ్యవహరించారు. బాలికలకు సముచిత విద్య కోసం ‘యూనిసెఫ్’తో కలసి పనిచేస్తున్నారు. ఆమిర్ ఖాన్ తో ఆమె నటించిన ‘లాల్ సింగ్ ఛద్దా’ ఈ మధ్యే విడుదలై పరాజయం పాలయింది. భవిష్యత్ లో కరీనా మరిన్ని చిత్రాలతో జనాన్ని ఆకట్టుకుంటారని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!