Karan Johar: ట్విటర్‌కు గుడ్‌బై చెప్పేసిన కరణ్ జోహార్.. కారణమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karan Johar Quits Twitter And Deletes His Account: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సెలెబ్రిటీల్లో.. బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఒకరు. ఈయన తన సినిమాలకు సంబంధించిన వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంటాడు. అప్పుడప్పుడు వివాదాస్పద అంశాలపై కూడా తన అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తుంటాడు. అలాంటి కరణ్ ఇప్పుడు ట్విటర్‌కి గుడ్ బై చెప్పేశాడు. తన ఖాతాను డిలీట్ చేసేశాడు. దీంతో.. ఎందుకు కరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు? అసలేం జరిగింది? అనే అంశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కరణ్ చేసిన చివరి ట్వీట్‌ని బట్టి, తనపై వస్తున్న ట్రోల్స్ నుంచి ఉపశమనం పొందేందుకే అతడు ట్విటర్‌కి గుడ్‌బై చెప్పినట్టు స్పష్టమవుతోంది.
సాధారణంగానే కరణ్ జోహార్‌పై ట్రోల్స్, విమర్శలనేవి వస్తుంటాయి. అయితే.. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన తర్వాత ఆ ట్రోల్స్, విమర్శలు మరింత పెరిగిపోయాయి. ఇండస్ట్రీలో ఏ ఇష్యూ జరిగినా సరే, ట్రోలర్స్ ప్రధానంగా కరణ్ జోహర్నే టార్గెట్ చేస్తారు. మొన్న బాయ్‌కాట్ ట్రెండ్ సమయంలో కూడా అతనిపై తారాస్థాయిలో విమర్శలు ఎక్కువపెట్టారు. బాలీవుడ్ అతని వల్లే నాశనం అవుతోందంటూ తిట్టిపోశారు. ఇలా తన మీద నిత్యం వస్తోన్న విమర్శలకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే.. కరణ్ ట్విటర్‌కు గుడ్‌బై చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ.. అతను చివరగా చేసిన ట్వీట్ ఏంటో తెలుసా? ‘‘పాజిటివ్ ఎనర్జీ, ప్రశాంతత కోసం కాస్త విరామం తీసుకోవాలనుకుంటోన్నా. అందులో భాగమే ఈ తొలి అడుగు. గుడ్‌బై ట్విటర్’’. ఇదే కరణ్ చేసిన చివరి ట్వీట్.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
కరణ్ ఆ ట్వీట్ చేయడమే ఆలస్యం.. నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వెల్లడించడం మొదలుపెట్టారు. ‘సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కంటే ప్రశాంతత ఎంతో ముఖ్యం, మంచి నిర్ణయం తీసుకున్నారు’ అంటూ ఓ రీట్వీట్లు చేశారు. కాసేపయ్యాక కరణ్ తన ఖాతాను డిలీట్ చేశాడు. మరి, ఇతడు శాశ్వతంగా గుడ్‌బై చెప్పాడా? లేక కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తాడా? అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు