NTV Telugu Site icon

Kantara Movie: కాంతారాకు బ్రహ్మరథం పడుతున్న బాలీవుడ్ జనాలు

Kantara Review1

Kantara Review1

Kantara Movie: కన్నడ నాట కాంతారా సినిమా మంచి హిట్ టాక్‎తో దూసుకుపోతోంది. ఆ సినిమా హీరో రిషబ్ శెట్టి తన నట విశ్వరూపాన్ని చూసిన వీక్షకులు ‘అబ్బా.. ఏం చేశాడు’ అంటూ మెచ్చుకుంటున్నారు. హిందీలో విడుదలైన సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్లనే రాబడుతోంది. ఇంతవరకూ అక్కడ ఈ సినిమా 13.10 కోట్లను వసూలు చేసింది. ఇంకా అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. క్లైమాక్స్ లో అమ్మవారు ఆవహించి దుష్ట శిక్షణ చేయించే సన్నివేశంలో రిషబ్ శెట్టి నటనకు ప్రేక్షకులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Read Also: Rozgar Mela: రానున్నది జాబుల జాతర.. మోదీ చేతుల మీదుగా ముహూర్తం

రిషబ్ శెట్టి తన చిన్నతనంలో తన గ్రామంలోని ఒక ఆచారం .. ఆ ఆచారంతో ముడిపడిన కొన్ని సంఘటనలతో ఒక కథను రెడీ చేసుకున్నాడు. ఆ కథనే ‘కాంతార’ సినిమాగా తెరపైకి తీసుకుని వచ్చాడు. రచయితగా .. దర్శకుడిగా .. హీరోగా ఈ మూడు పాత్రలకి ఆయన న్యాయం చేశాడు. అందుకు వివిధ భాషల్లో ఈ సినిమా రాబడుతున్న వసూళ్లే నిదర్శనం. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, తెలుగులో ఈ నెల 15వ తేదీన గీతా ఆర్ట్స్ వారు విడుదల చేశారు.

నిజానికి ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు తెలుగువారికి పెద్దగా తెలియదు. సినిమాలో ప్రధానమైన అంశంగా కనిపించే ఆచారం గురించి ఇక్కడి వారికి తెలియదు. అయినా కంటెంట్ ను ఆసక్తికరంగా నడిపించడంలో రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యాడు. అందువలన ఇది మన భాష కాదు .. తెరపై మనవాళ్లెవరూ లేరు అనే ఫీలింగ్ కలగదు. ఈ కారణంగానే ఈ సినిమా 5 రోజుల్లోనే 22.3 కోట్లను వసూలు చేసింది.

Show comments