Kantara Movie: కాంతారాకు బ్రహ్మరథం పడుతున్న బాలీవుడ్ జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kantara Movie: కన్నడ నాట కాంతారా సినిమా మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఆ సినిమా హీరో రిషబ్ శెట్టి తన నట విశ్వరూపాన్ని చూసిన వీక్షకులు ‘అబ్బా.. ఏం చేశాడు’ అంటూ మెచ్చుకుంటున్నారు. హిందీలో విడుదలైన సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్లనే రాబడుతోంది. ఇంతవరకూ అక్కడ ఈ సినిమా 13.10 కోట్లను వసూలు చేసింది. ఇంకా అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. క్లైమాక్స్ లో అమ్మవారు ఆవహించి దుష్ట శిక్షణ చేయించే సన్నివేశంలో రిషబ్ శెట్టి నటనకు ప్రేక్షకులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Read Also: Rozgar Mela: రానున్నది జాబుల జాతర.. మోదీ చేతుల మీదుగా ముహూర్తం
Also Read
రిషబ్ శెట్టి తన చిన్నతనంలో తన గ్రామంలోని ఒక ఆచారం .. ఆ ఆచారంతో ముడిపడిన కొన్ని సంఘటనలతో ఒక కథను రెడీ చేసుకున్నాడు. ఆ కథనే ‘కాంతార’ సినిమాగా తెరపైకి తీసుకుని వచ్చాడు. రచయితగా .. దర్శకుడిగా .. హీరోగా ఈ మూడు పాత్రలకి ఆయన న్యాయం చేశాడు. అందుకు వివిధ భాషల్లో ఈ సినిమా రాబడుతున్న వసూళ్లే నిదర్శనం. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, తెలుగులో ఈ నెల 15వ తేదీన గీతా ఆర్ట్స్ వారు విడుదల చేశారు.
నిజానికి ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు తెలుగువారికి పెద్దగా తెలియదు. సినిమాలో ప్రధానమైన అంశంగా కనిపించే ఆచారం గురించి ఇక్కడి వారికి తెలియదు. అయినా కంటెంట్ ను ఆసక్తికరంగా నడిపించడంలో రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యాడు. అందువలన ఇది మన భాష కాదు .. తెరపై మనవాళ్లెవరూ లేరు అనే ఫీలింగ్ కలగదు. ఈ కారణంగానే ఈ సినిమా 5 రోజుల్లోనే 22.3 కోట్లను వసూలు చేసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!