NTV Telugu Site icon

Kantara 2 : షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

Whatsapp Image 2023 08 22 At 5.43.03 Pm

Whatsapp Image 2023 08 22 At 5.43.03 Pm

గత ఏడాది చిన్న సినిమా గా విడుదలయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతార. దక్షిణ కన్నడ సంస్కృతిలో భాగమైన భూతకోల నేపథ్యం ఆధారంగా కన్నడ హీరో మరియు దర్శకుడు అయిన రిషబ్ శెట్టి తెరకెక్కించాడు.ఈసినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. కాంతార మూవీ విడుదల అయిన అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుని .. అదిరిపోయే కలెక్షన్స్ ను కూడా సాధించింది.ఈ సినిమా దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.,దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాకు రెండవ భాగం తెరకేక్కించేందుకు సిద్ధం అయ్యారు.. కాంతార సినిమాకు సీక్వల్ గా కాకుండా ప్రీక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. అంటే కాంతార సినిమాకు ముందు జరిగిన భాగాన్ని ఈసినిమాలో చూపించబోతున్నారు మేకర్స్. అయితే ఈ ప్రీక్వల్ షూటింగ్ కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే ముందుగా ఈమూవీ షూటింగ్ ను ఆగస్ట్‌ చివరి వారంలో మొదలు పెట్టాలని భావించారు.. కాని ఇప్పుడు ఈషూటింగ్ ను పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం.

మేకర్స్ కాంతారా ప్రీక్వెల్ మూవీ షూటింగ్ ని ఈ ఏడాది నవంబర్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని నవంబర్ నెలలో స్టార్ట్ చేసి అక్కడ నుంచి రెగ్యులర్ షూట్ ను నాన్ స్టాప్ గా చేయనున్నట్లు సమాచారం..ఈ ప్రీక్వల్ చిత్రం ఈ సారి భారీ బడ్జెట్ తో భారీ తారాగణం తో తెరకెక్కనున్నట్లు సమాచారం.ఈ మూవీ హీరో మరియు దర్శకుడు అయిన రిషబ్ శెట్టి ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ మూవీ లో ఒక పాత్రకోసం రిషబ్ శెట్టి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు.. హీరో రిషబ్‌శెట్టి ఈసినిమా కోసం గుర్రపుస్వారీతో పాటు కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లో శిక్షణ పొందబోతున్నట్లు సమాచారం. మరి ఈ సారి గ్రాండ్ గా తెరకెక్కుతున్న కాంతారా 2 ప్రేక్షకులకు మరోసారి డివోషనల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధం అవుతుంది.

Show comments