Kannappa Re Release Date : మరోసారి థియేటర్లలోకి ‘కన్నప్ప’… రీ రిలీజ్ డేట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa Re Release Date : భక్తి, త్యాగం, ఆధ్యాత్మికతను అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రం ‘కన్నప్ప’. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ భక్తిరస గాథను మరోసారి బిగ్ స్క్రీన్‌పై ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని చిత్రబృందం ‘కన్నప్ప’ను మరోసారి థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ ఎపిక్ డివోషనల్ డ్రామాను మరోసారి భారీ తెరపై చూస్తూ భక్తి లో లీనం కానున్నారు.
విష్ణు మంచు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా తెరకెక్కిన ‘కన్నప్ప’లో ఆయన భక్త కన్నప్ప పాత్రలో ఒదిగిపోయి నటించారు. శివభక్తుడైన కన్నప్ప జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ అత్యంత ప్రభావవంతంగా ఆవిష్కరించారు. భక్తి కథలకు ఆధునిక విజువల్ ట్రీట్మెంట్ను జోడిస్తూ రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పరమశివుడిపై అచంచల భక్తిని చాటిచెప్పిన కన్నప్ప కథను మరోసారి భారీ తెరపై ఆస్వాదించేందుకు సిద్ధం కావాలని మేకర్స్ అభిమానులను కోరారు. గతంలో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులకు ఇది మరో మంచి అవకాశం కానుంది.
Also Read
- Idupu Kayitham : బంతి భోజనాల్లో 'మందు' కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
- మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
- Mythri Ravi : 'ఫౌజీ', 'డ్రాగన్' రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
- Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
‘కన్నప్ప’ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ నటీనటులు ప్రత్యేక పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు. టెక్నికల్ గా కూడా ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు పొందింది. స్టీఫెన్ దేవస్సి అందించిన సంగీతం భక్తి భావాన్ని మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేయగా, విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు, అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని ఒక విజువల్ వండర్‌గా నిలబెట్టాయి. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ విలువల పరంగా కూడా ప్రశంసలు అందుకుంది.
ఇటీవలి కాలంలో పలు క్లాసిక్ చిత్రాలు, హిట్ సినిమాలు రీ రిలీజ్ అయి మంచి వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో ‘కన్నప్ప’ కూడా మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భక్తి చిత్రాలను కుటుంబ సమేతంగా వీక్షించే ప్రేక్షకులకు ఈ సినిమా మరోసారి మంచి ఆధ్యాత్మిక అనుభూతిని అందించే అవకాశముంది. జూన్ 27న మరోసారి వెండితెరపై సందడి చేయనున్న ‘కన్నప్ప’ రీ రిలీజ్‌కు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!