Nani : కన్నడిగులు హర్ట్… సారీ చెప్పిన సుందరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. ఈ సినిమాను సౌత్ లో మాత్రమే విడుదల చేస్తుండగా, అందులోనూ కన్నడ వర్షన్ ను విడుదల చేయడం లేదు. “అంటే సుందరానికి” కన్నడలోకి ఎందుకు డబ్ కావడం లేదనే విషయంలో నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు కన్నడిగులు నాని వ్యాఖ్యలకు హర్ట్ అయ్యారు.
Read Also : Ram Charan: అందుకే నాన్నకు నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్నా..
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
“అంటే సుందరానికి” టీజర్ లాంచ్‌లో నాని మాట్లాడుతూ ఈ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులు తెలుగులోనే చూస్తారని, అందుకే కన్నడలో డబ్ చేయడం లేదని, చాలా మంది కన్నడ ప్రజలు తెలుగును అర్థం చేసుకుంటారని, తెలుగు చిత్రాలను చూడటానికి ఇష్టపడతారని అన్నారు. కానీ మిగతా వాళ్లకు మాత్రం వాళ్ళ భాషలో సినిమాను విడుదల చేస్తేనే అర్థమౌవుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై కన్నడ ప్రేక్షకులు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా నానిని ట్యాగ్ చేస్తూ తెలుగు హీరోలు తమ సినిమాలను కన్నడ ప్రేక్షకులు చూడాలనుకుంటే, కన్నడలోకి కూడా డబ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలతో షాక్‌కు గురైన నాని స్పందిస్తూ “డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేనప్పుడు కూడా నా సినిమాలు లేదా ఇతర తెలుగు చిత్రాలను మన కన్నడ కుటుంబం ఎలా ఆదరాభిమానాలు చూపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రెస్ మీట్‌లో ఒక నిర్దిష్ట సందర్భంలో సమాధానం వస్తుంది. సోషల్ మీడియాలో ఆ సందర్భాన్ని బయటకు తీశారు. నేను చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా చెప్ప్పలేకపోయినందుకు సారీ… బౌండరీస్ దాటి కన్నడ సినిమా సాధించిన సక్సెస్ కు గర్వపడుతున్నా” అంటూ వివరణ ఇవ్వక తప్పలేదు నానికి.

Nani
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!