Kantara Release in Telugu: ఈ ఏడాది కేజీఎఫ్-2, చార్లీ 777 తర్వాత కన్నడలో విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న మూవీ ‘కాంతార’. గత నెలలో కన్నడ భాషలో ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు బుక్ మై షోలో 99 శాతం రేటింగ్ ఉండటం విశేషం. 50 వేల మంది ఓటు వేసినా ఈ స్థాయిలో పర్సంటేజ్ ఉండటం అంటే గొప్ప విషయమే. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా విడుదల కాబోతోంది. కంటెంట్ ఉన్న ఏ భాషకు చెందిన సినిమాలను అయినా తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారన్న నమ్మకంతో మేకర్స్ ఈ మూవీ తెలుగు హక్కులను విక్రయించగా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ దక్కించుకుంది.
Read Also: Bigg Boss 6: బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్?
తెలుగులో ఈనెల 15న ‘కాంతార’ మూవీని విడుదల చేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించాడు. అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. కేజీఎఫ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ ఈ మూవీని నిర్మించారు. కాంతార అనేది సంస్కృత పదం. తెలుగులో అడవి అని అర్థం. అడవిపై మనం ఎంత ప్రేమను చూపిస్తే అంతే ప్రేమను అందిస్తుంది.. ఎంత విద్వేషం చూపితే అంతకు మించిన విధ్వంసం జరుగుతుందని ఈ మూవీలో చూపించారు. తెలుగులోనూ ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.
