Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!

Rashmika Mandanna1

Rashmika Mandanna1

తెలుగు ఇండస్ట్రీలో ముంబై భామల హవా తగ్గింది. ఆ మధ్య కేరళ కుట్టీలు కొంతకాలం జోరు చూపించినా, ప్రస్తుతం సందడంతా కూడా కన్నడ భామలదే! సినిమాకు ఒక కన్నడ కస్తూరి పరిచయం అవుతుంది. టాలీవుడ్ నేలుతున్న శాండల్ వుడ్ బ్యూటీస్ ఎవరో ఒకసారి చూద్దాం. రష్మికలా స్టార్ ఇమేజ్ కోసం మరో కన్నడ భామ ఆషికా రంగనాథ్ ట్రై చేస్తోంది. తెలుగు డెబ్యూ మూవీ ‘అమిగోస్’ ఫ్లాప్ అయినా, ‘నా సామి రంగ’లో ఇంపార్టెంట్ రోల్ పోషించి సినిమాకు హైలైట్ గా నిలిచింది. ‘భారత మహాశయులకు విజ్ఞప్తి’లో గ్లామర్ రోల్ తో ఆకట్టుకుంది. ఆషికాకు సరైన హిట్ పడడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘సర్దార్ 2’ డిజాస్టర్ అయింది. ‘విశ్వంభరి’తో ఫామ్ లోకి వద్దాం అనుకుంటే ఈ సినిమా ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. శ్రీ విష్ణుతో జతకట్టిన సినిమా ఈ మధ్యనే మొదలైంది. మిస్ కర్ణాటకగా ఎంపికైన శ్రీనిధి శెట్టిని ప్రశాంత్ నీల్ ‘కేజిఎఫ్’ తో వెలుగులోకి తీసుకొచ్చాడు. ‘కేజిఎఫ్’ తో రాని గుర్తింపు ‘కేజిఎఫ్ 2’ తో వచ్చినా, 18 నెలల పాటు మరో క్రేజీ మూవీకి సైన్ చేయలేదు. కన్నడ ఇండస్ట్రీ శ్రీనిధిని పట్టించుకోకపోయినా, తెలుగు సినిమా ఆదుకొని ‘హిట్ త్రీ: తెలుసు కదా’లో ఛాన్స్ ఇచ్చింది. శ్రీనిధి శెట్టి కన్నడలో కంటే తెలుగులో బిజీ అయిపోతోంది. యంగ్ హీరోలతో తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీనిధికి డబుల్ ప్రమోషన్ వచ్చి ‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేష్ తో జతకట్టింది.

తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక నేషనల్ క్రష్ గా ఎదిగింది. ‘ఛలో’ అంటూ తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక, స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘పుష్ప’ తర్వాత జాతకం మారిపోయి పాన్ ఇండియా హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది రష్మిక. మరో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఆరేళ్ల క్రితమే వెండి తెరపైకి వచ్చింది. ‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో క్రేజ్ తెచ్చుకొని, ‘కాంతార: చాప్టర్ వన్’ తో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించింది. ప్రస్తుతం క్రేజీ మూవీ ‘డ్రాగన్’ లో నటిస్తోంది రుక్మిణి. ‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ కృతి శెట్టి, హ్యాట్రిక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫ్లాప్లే. గ్యాప్ తర్వాత జనవరి 12న విడుదలైన మూవీలో అనిల్ రావిపూడి ఛాన్స్ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ కు జోడీగా నటిస్తూ అదృష్టం పరీక్షించుకుంటోంది. తెలుగు ఇండస్ట్రీని ఏలిన అనుష్క కన్నడ బ్యూటీనే! అందాల తార ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనేలది కేర్ ఆఫ్ కర్ణాటకే. పూజా హెగ్డే ప్రస్తుతం హిట్స్ లేక అవస్థలు పడుతోందే గానీ, గతంలో తెలుగులో స్టార్స్ అందరిని చుట్టేసింది.