Site icon NTV Telugu

నువ్వు ఏమీ అనుకోనంటే.. నాకైతే “ఊ బోలేగా” పెద్దగా నచ్చలేదు

pushpa

pushpa

కరోనా కాలంలో కూడా కలెక్షన్స్ ముందుకు దూసుకుపోతున్న పుష్ప సినిమాలో సమంత ‘ఊ అంటావా” సాంగ్ తెలుగు లో ఎంత సూపర్ హిట్ అయిందో చెప్పాలిసిన అవసరం లేదు. హిందీ లో ఈ సాంగ్  పాడిన సింగర్ కనికా కపూర్ తో దగ్గర వాళ్ళ నుండి కాల్స్ , మెసేజెస్ వచ్చాయంట. 
ఈ  పాట ఎందుకో మాకు అంతగా నచ్చలేదని ఫీడ్ బ్యాక్ చెప్పారు , కానీ సింగర్ మాత్రం ఇవి అన్నీ పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. సాంగ్ హిట్  అయ్యినప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకోకుడవు అనుకున్నదట.  అందుకే అలాంటి మాటలను పట్టించుకోకూడదని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ సాంగ్ తెలుగు వెర్షన్ ఎంతటి పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఎంతోమంది విమర్శలను అందుకుంది. మగ వాళ్ళ మీద ఇలా రాస్తారా అంటూ విమర్శలు చేశారు. కానీ, మేకర్స్ ఈ విమర్శలను ప్రసంశలు లనే తీసుకున్నారు. విమర్శలు చేసినవాళ్ళే సినిమా రిలీజయ్యాక హిట్ అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ని ఇంకా షేక్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version