Kanika Dhillon: వారు స్త్రీలను పశువుల్లా చూస్తారు.. రాఘవేంద్ర రావు మాజీ కోడలు షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanika Dhillon:కనికా థిల్లాన్.. ఈ పేరు టాలీవుడ్ లో సగం మందికి తెలియకపోవచ్చు.. కానీ బాలీవుడ్ లో ఆమె ఫేమస్ రచయిత్రి. ఎన్నో మంచి కథలను బాలీవుడ్ కు అందించిన ఆమె మన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మాజీ కోడలని చాలా తక్కువ మందికి తెలుసు. రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి.. అదేనండీ అనుష్కతో కలిసి జీరో సైజ్ సినిమా తీసిన డైరెక్టర్ భార్యనే కనికా.. వీరిద్దిరి మధ్య విబేధాలు తలెత్తడంతో ఈ జంట 2017 లో విడాకులు తీసుకొని విడిపోయారు.. ఆ తర్వాత కనికా.. హిమాన్షు శర్మను వివాహమాడింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలకు కథలను అందిస్తూ బిజీగా మారింది. ఇటీవల అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రక్షా బంధన్ సినిమాకు కథను అందించింది కనికానే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. చెల్లెళ్లకు పెళ్లి చేయడం కోసం అన్నయ్య పడే తపన.. అందుకోసం చెల్లెళ్ళపై అతడి చూపించే కోపం ఎలాంటివి అనేది ఈ సినిమాలో చూపించారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో కనికా ఈ కథపై మాట్లాడింది. ” ఈ సినిమా కథను నేను పట్టణంలో నివసించేవారు కోసం రాసుకోలేదు.. గ్రామంలో నివసించే ఆడపిల్లల కోసం రాసుకున్నాను.
భారతదేశంలో వరకట్న మరణాలపై అధికారిక గణాంకాలకు ఈ చిత్రం ప్రతిబింబంగా తెరకెక్కించాం. ఇందులో అక్షయ్ పాత్రలానే సమాజం ఉంది. వారు స్త్రీలను పశువుల్లా చూస్తారు.. ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలంటే సన్నగా నాజూకుగానే ఉండాలి.. ఆమెకు ఎవరైనా విజిల్ వేస్తే వారినే పెళ్లాడాలి..? అని షరతులు విధిస్తారు. ఇలాంటివి సమాజంలో ఇంకా ఉన్నాయి అని చూపించే ప్రయత్నం చేశాం. అయితే మా లెక్క తప్పింది. ఎలాగంటే.. ప్రస్తుత యువత ఇలాంటివి చూడడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. ఈ సినిమాలో ఆడవారిని అలా చూపించడం అనేది కొంతమంది వర్గాలకు నచ్చింది. నిజం చెప్పాలంటే మన దేశ గణాంకాలు కూడా అవే చెప్తున్నాయి. స్త్రీలను పశువులుగా చూడడం, బాడీ షేమింగ్, వివాహం కానీ స్త్రీలనే టార్గెట్ చేయడం.. ఆడపిల్లల కట్నాలు కోసం తల్లిదండ్రులు కష్టపడడం, వారి బాధ చూడలేక తమను తామే చంపుకోవడం.. ఇవన్నీ జరిగినవి.. జరుగుతున్నవి. అయితే ఇదంతా పట్టణ వాసులకు నచ్చకపోవొచ్చు.. కానీ మేము అనుకున్న ఒక వర్గం వారికి మాత్రం బాగా నచ్చింది.. అందులో మేము సక్సెస్ అయ్యాం”అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
తాజావార్తలు
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
-
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!