బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మొట్టమొదటి పూర్తి యాక్షన్ ప్యాక్డ్ చిత్రం “ధాకడ్”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
భారతదేశంలోని బొగ్గు గనుల బెల్ట్ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆసియాలోని అతిపెద్ద మానవ అక్రమ రవాణా సిండికేట్ కథను ‘ధాకడ్’లో చూపించబోతున్నారు. భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా అర్జున్ రాంపాల్ కన్పించగా, స్పై ఏజెంట్ గా కంగనా వేసిన రకరకాల వేషాలు, చేసిన స్టంట్స్ అదిరిపోయాయి. యాక్షన్ ప్రియులకు ఈ ట్రైలర్ ఒక ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు.
Read Also : Mahesh Babu : ప్యారిస్ ట్రిప్… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆల్బమ్
ఏజెంట్ అగ్నిగా కంగనా ఈ సిండికేట్ వెనకున్న నిజాల్ని బయటపెట్టడానికి, నిందితులను పట్టుకోవడానికి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ స్పై థ్రిల్లర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కంగనా చేసిన యాక్షన్ స్టంట్స్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మొత్తానికి ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో కంగనా కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు. రజ్నీష్ రజీ ఘాయ్ రచించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ధాకడ్’ చిత్రాన్ని మే 20న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.