Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana vs Rakhi Sawant: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, డ్రామా క్వీన్ రాఖీ సావంత్ మధ్య ఇటీవలే ఒక పాడ్‌కాస్ట్ టాక్ షో కారణంగా ఘాటైన మాటల యుద్ధం చెలరేగింది. ఇటీవల ‘ఎమ్కే టాక్స్’ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాఖీ సావంత్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, మహిళా రాజకీయ నాయకురాళ్లైన కంగనా రనౌత్, స్మృతి ఇరానీల పొలిటికల్ జర్నీపై కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. వాళ్లు మోదీజీకి ఏమి ఇచ్చి మంత్రి పదవులు, అవకాశాలు పొందారో, తానూ అవన్నీ ఇవ్వగలనంటూ రాఖీ చేసిన చౌకబారు కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి.
రాఖీ చేసిన ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. సమాజంలో ఏ రంగంలోనూ సక్సెస్ కాలేక, నిరాశతో బతికే కొంతమంది వ్యక్తులు.. కష్టపడి పైకొచ్చిన మహిళల క్యారెక్టర్‌ను బలి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని మండిపడ్డారు. వాళ్ళ అసూయ, ఈగోలను శాంతింపజేసుకోవడానికే ఇలాంటి దిగజారుడు విమర్శలు చేస్తారని, ఇకపై మహిళలు ఎవరూ ఇలాంటి దాడులకు లొంగిపోవాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదని కంగనా స్పష్టం చేశారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇంతటితో ఆగకుండా రాఖీ సావంత్‌ను ఉద్దేశించి కంగనా తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నువ్వు సక్సెస్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతావేమో కానీ, నీ దగ్గర నుండి ఎవరికీ ఏమీ అక్కర్లేదు. నువ్వు ఎన్ని ఫేవర్లు చేసినా, నీకున్న క్వాలిటీకి నీకు కనీసం ఒక స్వీపర్ ఉద్యోగం కూడా రాదు, ఎందుకంటే ఆ ఉద్యోగానికి కూడా కొంత టాలెంట్ కావాలి అంటూ రాఖీ కెరీర్‌ను ఎండగట్టారు. చివరిగా.. నువ్వు ఏమీ చేయలేవు కాబట్టి హాయిగా ఒకచోట కూర్చుని నా రీల్స్ చూస్తూ ఏడుస్తూ ఉండు అంటూ కంగనా ఇచ్చిన రిటార్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కంగనా రనౌత్‌కు తనపై వచ్చే విమర్శలకు ఘాటుగా స్పందించే అలవాటు ఉంది. తనను ఎవరైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేరుగా కౌంటర్ ఇవ్వడంలో ఆమె ఎప్పుడూ వెనుకాడరు. ఈసారి కూడా రాఖీ వ్యాఖ్యలకు స్పందించిన తీరు చూస్తే.. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా, లేక రాఖీ నుంచి మరో కౌంటర్ వస్తుందా అనేది వేచి చూడాలి.
- Tags
- cinema
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!