Site icon NTV Telugu

Kangana Ranaut: కరణ్ జోహార్ నువ్వు ఏడ్చే రోజు వచ్చేసింది.. చూడు

kangana ranaut

kangana ranaut

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తేమి కాదు. నిర్మొహమాటంగా మనస్సులో ఏది అనిపిస్తే అది నేయడం ఆమె స్పెషల్. ఎదుట ఎవరు ఉన్నారు.. వారు ఎంత పెద్దవారు అనేది ఆమె అస్సలు చూడడు. తప్పు అని అనిపిస్తే ముఖం మీదే కడిగిపాడేస్తుంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహారు పై అమ్మడి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. ఆయన షో కి వెళ్లి ఆయనపైనే సంచలన వ్యాఖ్యలు చేసింది ఫైర్ బ్రాండ్..  కరణ్‌ టాక్ షో అయిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోకు సైఫ్‌ అలీ ఖాన్‌తో కలిసి సందడి చేసిన ఈ భామ కరణ్ నెపోటిజానికి సూత్రధారి, సినిమా మాఫియా లాంటివాడు అని అనేసింది. దీంతో వీరిద్దరి మధ్య శత్రుత్వం మొదలైంది. ఇక ఇది ముగిసిపోయింది అనుకొనేలోపు మరోసారి కరణ్ పై అమ్మడు నోరు పారేసుకుంది. ప్రస్తుతం కంగనా లాకప్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే.

తాజాగా ఈ షో 200 మిలియన్‌ వ్యూస్ సాధించడంతో కంగనా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టింది. ” లాకప్ షో మిలియన్‌ వ్యూస్ సాధించడంతో బాలీవుడ్ లోని కొంతమంది రహస్యంగా ఏడవడానికి సిద్ధమయ్యారు. నువ్వు కూడా ఏడ్చే రోజు వచ్చేసింది చూడు .. పాపా జో” అంటూ రాసుకొచ్చింది. ఇక దీంతో కంగనా , మరోసారి కరణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని బాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. కాఫీ విత్ కరణ్ షో కంటే కంగనా లాకప్ షో చాలా రసవత్తరంగా నడుస్తోందని ప్రేక్షకులు బాహాటంగానే చెప్పుకొస్తున్నారు. మరి అమ్మడి మాటలపై బడా నిర్మాత ఎలా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version