Devil: ‘డెవిల్’ సినిమా కోసం 90 కాస్ట్యూమ్స్‌ను ఉపయోగించిన కళ్యాణ్ రామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalyanram has 90 costume changes for the film Devil: డిఫరెంట్ మూవీస్‌తో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించగా ఒకసారి వాయిదా పడి డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సన్నద్ధమవుతోంది. ఇదొక పీరియడ్ డ్రామా కాగా బ్రిటీష్‌వారు ఇండియాను పరిపాలించిన కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కిన సినిమా కావటంతో నాటి పరిస్థితులను ఆవిష్కరించేలా భారీగా సినిమాను చిత్రీకరించారు. అలాగే నటీనటులకు సంబంధించిన వస్త్రాలంకరణ భారతీయతను ప్రతిబింబించేలా ఉంటుంది. కళ్యాణ్ రామ్‌ను గమనిస్తే ఆయన ఇందులో గూఢచారిగా కనిపించబోతున్నారు. ఇలాంటి పాత్రను ఆయన చేయటం ఇదే మొదటిసారి కావటంతో దర్శక నిర్మాత అభిషేక్ నామా, కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ , కళ్యాణ్ రామ్ లుక్‌ను సినిమా ఆసాంతం సరికొత్తగా ఉండేలా డిజైన్ చేశారు. దీని గురించి కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ మాట్లాడుతూ ‘‘అభిషేక్ నామాగారు డెవిల్ స్క్రిప్ట్ నాకు వివరించగానే హీరోగారి లుక్ డిఫరెంట్‌గా ఉండాలని అర్థమైంది. ఇందులో హీరో భారతీయుడు, అయినప్పటికీ బ్రిటీష్ గూఢచారిగా పని చేస్తుంటారు. ఆయన పాత్ర ను ఎలివేట్ చేసేలా కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయాలనుకున్నాను. డెవిల్‌లో కళ్యాణ్ రామ్‌ను గమనిస్తే ఆయన ధోతి కట్టుకుని ఉంటారు. పైన ఒక వెయిస్ట్ కోటుని ధరించి ఉంటారు. ఆయన కాస్ట్యూమ్స్‌లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం’’ అన్నారు.
Nandu: గీతామాధురి ఆ పిచ్చితో డబ్బులు పోగొట్టింది.. పెద్ద గొడవ .. పోలీసులు వచ్చి
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
‘డెవిల్’ కాస్ట్యూమ్స్ హైలైట్స్
* డెవిల్ సినిమా కోసం కళ్యాణ్ రామ్ 90 కాస్ట్యూమ్స్‌ను ఉపయోగించారు.
* ఇటలీ నుంచి తెప్పించిన మోహైర్ ఊల్‌తో 60 బ్లేజర్స్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు
* వెయిస్ట్ కోటుతో పాటు దేశీయ కాటన్‌తో కుర్తా, ధోతిని తయారు చేశారు
* ప్రతీ కాస్ట్యూమ్ (బ్లేజర్, కుర్తా, ధోతి)కి 11.5 మీటర్స్ ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించారు
* హీరోని స్టైల్‌గా చూపించే క్రమంలో 25 ప్రత్యేకమైన వెయిస్ట్ కోట్స్‌ను ఉపయోగించారు
* హీరో వేసుకునే బ్లేజర్ జేబు పక్కన వేలాడుతూ ఉండేలా ఓ హ్యాంగింగ్ వాచ్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు
* పురాతన వాచీలను సేకరించే వ్యక్తి డిల్లీలో ఉంటే అతని దగ్గర నుంచి ఈ హ్యాంగింగ్ వాచ్‌ను తీసుకురావటం విశేషం
* కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్‌కి డెవిల్ 60వ చిత్రం.. కళ్యాణ్ రామ్‌తో ఇది 6వ సినిమా. ఎం.ఎల్.ఎ, 118, ఎంత మంచివాడవురా వంటి కళ్యాణ్ రామ్ సినిమాలకు రాజేష్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశారు. ఆయన చేయబోతున్న నెక్ట్స్ 3 సినిమాల్లోనూ రాజేష్ వర్క్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..