Kalyan Ram Reveals His Most Failure Movie: నందమూరి కళ్యాణ్ రామ్‌కి సరైన హిట్ పడి చాలాకాలమే అవుతోంది. ‘పటాస్’ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ కళ్యాణ్‌కి పడలేదు. ‘118’ యావరేజ్ అనిపించుకుంది కానీ, పటాస్ రేంజ్ హిట్ అయితే కాలేదు. దీంతో ఈ హీరో ఇప్పుడు బింబిసార మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. టైమ్ ట్రావెల్, ఫ్యాంటసీ నేపథ్యాలతో రూపొందిన ఈ సినిమా, కచ్ఛితంగా తనకు మంచి విజయాన్నందిస్తుందని నమ్మకంగా ఉన్నాడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనూ ఈసారి తాను డిజప్పాయింట్ చేయనని చెప్పిన కళ్యాణ్.. జోరుగా ప్రచార కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నాడు.
ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని కళ్యాణ్ చెప్పాడు. తనని బాగా దెబ్బతీసిన సినిమా పేరుని రివీల్ చేశాడు. ఆ సినిమా పేరే ‘ఓం’ (3డీ). బింబిసార తరహాలోనే ఆ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, భారీ ఖర్చు వెచ్చించాడు కళ్యాణ్. కానీ, అది బోల్తా కొట్టింది. ఆ సినిమాపై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, కానీ దాని ఫలితం చూశాక బాగా ఫీలయ్యానన్నాడు. ఆ చిత్రంపై తమ లెక్కలు పూర్తిగా తప్పాయని, అది తనని ఆర్థికంగా దెబ్బతీసిందని పేర్కొన్నాడు. కానీ.. ‘పటాస్’ ఆ నష్టాల్ని రివకరీ చేసిందన్నాడు. ఇక ఈ చిత్రాన్ని తారక్ చూశాడని, కర్నూల్‌లో షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల బాబాయ్ బాలయ్య ఇంకా చూడలేదని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.