Kalyan Ram: రెండు సినిమాలు అనౌన్స్ చేసావ్ బ్రో? ఏది ముందు స్టార్ట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసారతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన కళ్యాణ్… లేటెస్ట్ గా డెవిల్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అభిషేక్ నామా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా సో సో రిజల్ట్ నే సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డెవిల్‌గా అదరగొట్టాడు కళ్యాణ్ రామ్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌తో దుమ్ములేపాడని అంటున్నారు. దీంతో.. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కలిసి మరో మంచి సినిమా చేసారు. రిలీజ్ రోజున చేసిన సెలబ్రేషన్స్‌లో భాగంగా.. డెవిల్ 2 కూడా ఉంటుందని అనౌన్స్ చేశాడు కళ్యాణ్ రామ్. ‘డెవిల్ 2 ఉంటుంది. నా టీమ్ మెంబర్స్‌తోనే ఉంటుంది. 2024లో డెవిల్ 2 మొదలుపెట్టి 2025లో రిలీజ్ చేస్తాం. డెవిల్2 లో 1940 ఎరా.. 2000 ఎరా కూడా కనిపిస్తుంది. ఈ రెండు కాలాలు కలిపి చూడబోతున్నారు…’ అని చెప్పుకొచ్చాడు.
డెవిల్ రిలీజ్ రోజునే సీక్వెల్ అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్ ఇప్పటికే బింబిసార 2 కూడా అనౌన్స్ చేశాడు. వశిష్ట కాకుండా ఇంకో దర్శకుడితో బింబిసారా 2 స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే బింబిసారా 2 అనౌన్స్ చేసిన తర్వాత కూడా కళ్యాణ్ రామ్ నుంచి రెండు సినిమాలొచ్చాయి. అమిగోస్ ఫ్లాప్ అవగా… డెవిల్ ఓకె అనిపించుకుంది. ఇక ఇప్పుడు డెవిల్ 2 అనౌన్స్ చేశాడు కానీ డెవిల్ ట్రైలర్ లాంచ్‌లో… వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో బింబిసార 2 షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించాడు. దీంతో… ఈ రెండు సీక్వెల్స్‌లలో ఏది ఫస్ట్ సెట్స్ పైకి వెళ్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే NKR21 వర్కింగ్ టైటిల్‌తో మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. మరి ఆ తర్వాత బింబిసార 2 చేస్తాడా? డెవిల్ 2 తీస్తాడా? అనేది చూడాలి.
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?