రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దీపికా పడుకొనే ముఖ్య పాత్రలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1100కోట్లు కలెక్షన్స్ రాబట్టి రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొట్టి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.ఓవర్సీస్ లో కల్కి హంగామా ఇంకా కొనసాగుతుండగా ఓటీటీ విడుదలపై ఓ వార్త వినిపిస్తోంది.
ఈ చిత్రాన్ని 8 వారాల తర్వాతే ముందుగా ఒప్పందం చేసారు నిర్మాతలు. దీంతో రిలీజ్ నుండి ఎనిమిది వారాల లెక్కన సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ కావొచ్చు అనే టాక్ వినిపించింది. కానీ తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఒప్పదం కంటే ముందుగా అనగా ఈ ఆగస్ట్ 23 నుంచే ఓటిటిలో అందుబాటులో ఉండనున్నట్టుగా వినిపిస్తుంది. కల్కి సౌత్ డిజిటల్ ఓటిటి హక్కులను స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేయగా, హిందీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
Also Read: Keerthy Suresh: ఆగస్టు 15 సినిమాల రేస్ లో రఘు తాత..కీర్తి మెప్పిస్తుందా..?
మారోవైపు కల్కి ఒప్పందం ప్రకారం రెంటల్ బేసిస్ లో ఆగస్టు 23న అందుబాటులో ఉంచి అగ్రిమెంట్ ప్రకారం 8 వారాల తర్వాత రెగ్యులర్ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే విధంగా ఆలోచనలు చేస్తోంది సదురు ఓటీటీ సంస్థ. కాగా కల్కి నేపాల్ లో సూపర్ కలెక్షన్స్ తో సాగుతోంది. ప్రభాస్ గా చిత్రం బాహుబలి -2 రికార్డును బద్దలు కొట్టి కల్కి పేరిట నయా రికార్డు నమోదు చేసింది.