Power Star: పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ‘కళాపురం’ ట్రైలర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Power Star:‘పలాస 1978’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి రా అండ్ రస్టిక్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించటమే కాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకున్న కరుణ కుమార్ ఈసారి అందుకు భిన్నంగా కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తోన్న చిత్రమే ‘కళాపురం’, ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ సినిమా క్యాప్షన్. ఆగస్ట్ 26న సినిమా రిలీజ్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి.. ‘కళాపురం’ సినిమాను నిర్మిస్తున్నారు. సత్యం రాజేష్, చిత్రం శ్రీను, రక్షిత్ అట్లూరి తదితరులు నటించారు.
ఇప్పటికే విడుదలైన ‘కళాపురం’ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, పోస్టర్స్, సాంగ్ అన్నీ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచాయి. ఇప్పుడీ అంచనాలను మరింతగా పెంచేలా మేకర్స్ ‘కళాపురం’ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి సినిమా మంచి విజయాన్ని సాధించాలని చిత్ర యూనిట్‌ను అభినందించారు.
Also Read
- Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
- ToxicTheMovie : 'టాక్సిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
- Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
- Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
1 నిమిషం 57 సెకన్ల వ్యవధి ఉన్న ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. సినిమాలో ప్రతి క్యారెక్టర్.. ఆ క్యారెక్టర్ ఛాలెంజెస్ ఏంటి అనే విషయాలను కామెడీ కోణంలో ఆవిష్కరించారు. ఓ దర్శకుడు, నిర్మాత కలిసి ఒక సినిమాను చేయాలనుకుంటారు. అయితే తాను ఉంటున్న కళాపురం గ్రామంలో కొంత సినిమా షూటింగ్ చేయాలనే కండీషన్ మీద నిర్మాత సినిమాను స్టార్ట్ చేస్తాడు. డబ్బు కోసం మధ్యలో పోలీసులు, విలన్ ఎంట్రీ ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో దర్శకుడు, నిర్మాత కలిసి సినిమాను ఎలా పూర్తి చేశారనేదే సినిమా. సత్యం రాజేష్ ఇందులో డైరెక్టర్ పాత్రను పోషించారు.
ట్రైలర్ చూస్తుంటే విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ కరుణ కుమార్ సినిమాలోని పాత్రలను చూపించిన తీరు, దాని వల్ల వచ్చే కామెడీ ప్రేక్షకులను తప్పకుండా నవ్విస్తుంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
-
Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!