స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. మే నెలలో తన డెలవరీ ఉంటుందని ఇప్పటికే కాజల్ సోషల్ మీడియా ద్వారా చెప్పకనే చెప్పింది. మాతృత్వంలోని మధురిమలను గత కొన్ని నెలలుగా ఆస్వాదిస్తున్న కాజల్ దానికి సంబంధించి తన తాజా ఆలోచనలను అభిమానులతో పంచుకుంది.
Read Also : Malaika Arora: యాక్సిడెంట్ పై పెదవి విప్పిన అందాల భామ!
మాతృత్వం కోసం సిద్ధం కావడం ఆనందంగా ఉందని చెబుతూనే, ‘అన్నీ మన చేతుల్లో ఉన్నాయని అనుకుంటాం. కానీ అదే సమయంలో మనసంతగా గజిబిజిగా మారిపోతుంది. ఎప్పుడు ఏమి చేస్తున్నామో, ఏమి చేయాలో తెలియకుండానే సమయం గడిచిపోతుంటుంది. మన పిల్లలను, జీవిత భాగస్వాములను ప్రేమిస్తున్నప్పుడు ఈ భావోద్వేగపు బంధంలో మనల్ని మనం మర్చిపోతుంటాం’ అంటూ తన మనసులోని భావాలను వ్యక్తం చేసింది. కాజల్ తన ఫోటోతో పాటు ఇలా ఈ పోస్ట్ పెట్టిందో లేదో… అలా సాధారణ అభిమానులతో పాటు సినీరంగానికి చెందిన వారు, తోటి కథానాయికలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.