వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్, సురభి లలిత, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్”. ఈ చిత్రాన్ని సుమలీల సినిమా బ్యానర్ పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశాత్మక కథా కథనాలతో రూపొందిన “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమాను ఈ నెల 12న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు బాపిరాజు. బుధవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.
Also Read :Sanyuktha Menon: అఖండ2లో సంయుక్తమీనన్ హీరోయిన్నా? ఐటంగర్లా?
ఈ కార్యక్రమంలో నటుడు దినేష్ మాట్లాడుతూ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశాను. నటుడిగా నాకు గుర్తింపు తీసుకొచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా డైరెక్టర్ ప్రసాద్ గారు అందరికీ నచ్చేలా రూపొందించారు అన్నారు. నటి చంద్రకళా మాట్లాడుతూ “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమా స్క్రిప్ట్ చదివినప్పుడు ఈ మూవీ నేను చేయగలనా అని భయపడ్డాను. కానీ సినిమా ఇండస్ట్రీపై ప్యాషన్ తో వచ్చినప్పుడు అవకాశాలు ఎందుకు వదులుకోవాలి అని ఛాలెంజింగ్ గా తీసుకుని నటించాను. ఈ సినిమాలో మనందరం సొసైటీలో చూసే సోషల్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే ప్రేక్షకులు థియేటర్స్ లో కోరుకునే ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది అన్నారు.