KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Productions: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమాల విషయంలోనే కాదు.. కథల విషయంలోనూ తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నారు. కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్‌లు, కొత్త జానర్లతో ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ‘చెన్నై లవ్ స్టోరీ’తో హిట్ తో జోష్ మీద ఉన్నారు కిరణ్ అబ్బవరం. ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా జీ స్టూడియోస్ నిర్మాణంలో రాబోతున్న భారీ పాన్-ఇండియా మైథలాజికల్ యాక్షన్-ఫాంటసీ సినిమా ‘ఇంద్రపుత్ర’ టైటిల్‌ను కూడా అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. అయితే రీసెంట్ గా కిరణ్ కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘తిమ్మరాజుపల్లి టీవీ’ వంటి ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చిన ఆయన.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాను ప్రకటించారు. అయితే ఈసారి కథ ఏమిటనేది మాత్రం మేకర్స్ పూర్తిగా సీక్రెట్‌గా ఉంచారు.
కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ కొత్త సినిమాని నిర్మిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం ఈ సినిమాను సమర్పిస్తుండగా.. అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, వై. శివశంకర్ నాయుడు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో కుష్లు మద్దాల, రెహమాన్, నమ్రిత ఎంవి, తనుజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటించనున్నారు. అయితే ఈ సినిమా ప్రకటనలోనే మేకర్స్ అసలు ట్విస్ట్ పెట్టారు. సాధారణంగా కొత్త సినిమా ప్రకటించినప్పుడు హీరో, హీరోయిన్, టైటిల్, కథకు సంబంధించిన చిన్న క్లూ లేదా ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తుంటారు. కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం పూర్తిగా భిన్నమైన పద్ధతిని ఎంచుకున్నారు. పక్షి కాళ్లను పోలిన ఒక భయంకరమైన ఆకారంతో కూడిన పోస్టర్‌ను మాత్రమే విడుదల చేశారు. దీంతో అసలు ఈ పోస్టర్ వెనుక ఉన్న అర్థం ఏమిటన్నది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read
- Irumudi Movie Controversy : 'ఇరుముడి' సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
- Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. 'శివ నువ్వు తోపు సామీ'.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
- Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
అంతేకాదు.. ఈ పోస్టర్‌తో మేకర్స్ చేసిన ప్రకటన కూడా సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కథ, జానర్‌ను పరిచయం చేస్తున్నామని చిత్ర బృందం పేర్కొంది. సాధారణంగా సినిమా ప్రమోషన్లో ఇలాంటి భారీ క్లెయిమ్‌లు చేసినప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం సహజం. కానీ ఇక్కడ కథకు సంబంధించిన ఒక్క క్లూ కూడా ఇవ్వకపోవడంతో ఆ ఆసక్తి మరింత ఎక్కువైంది. అసలు ఇది హారర్ సినిమానా? మిస్టరీ థ్రిల్లరా? ఫాంటసీ కథనా? లేక పూర్తిగా కొత్త జానర్ ప్రయోగమా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. కిరణ్ అబ్బవరం నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో మరో అంశం కూడా ఆసక్తిని కలిగిస్తోంది. యువ దర్శకులు, కొత్త టాలెంట్‌తో ప్రయోగాత్మక కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై ఆయన దృష్టి పెడుతున్నారు. హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. నిర్మాతగా మాత్రం కొత్త ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తుండటం టాలీవుడ్లో ప్రత్యేకంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు మరిన్ని వివరాలను మేకర్స్ రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా బయటపెట్టే అవకాశం ఉంది. అయితే మొదటి పోస్టర్‌తోనే ప్రేక్షకుల్లో ఇంత ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా నిజంగానే ఇంతవరకు చూడని కథను తీసుకొస్తుందా? లేక ఇది కేవలం ప్రమోషనల్ హైప్ మాత్రమేనా? తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
- Tags
- cinema
- Kiran Abbavaram
తాజావార్తలు
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!