Site icon NTV Telugu

K-Ramp : కె-ర్యాంప్ గ్లింప్స్ రిలీజ్.. నాటుగా దించేసిన కిరణ్‌ అబ్బవరం

K Ramp

K Ramp

K-Ramp : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కె-ర్యాంప్. ది రిచెస్ట్ చిల్లర్ గయ్ అనేది ట్యాగ్ లైన్. జైన్స్ నాని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మూవీ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో కిరణ్ అబ్బవరం ఊరనాటు పాత్రలో కనిపించాడు. గ్లింప్స్ నిండా నాటు బూతు మాటలే కనిపిస్తున్నాయి. క్లాస్ అనే పదం పక్కన పెడితే.. ఊర మాస్ పాత్రలో చేస్తున్నాడు కిరణ్‌. ఇప్పటి వరకు కిరణ్ మరీ ఇంత బోల్డ్ మాటలు మాట్లాడలేదనే చెప్పుకోవాలి. ఈ సారి ఒక్కొక్కడికి బుర్ర పాడు.. బుడ్డలు జారుతాయ్ అనే డైలాగ్ తో గ్లింప్స్ స్టార్ట్ చేశారు. ఈ డైలాగ్ తోనే తమ సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశారు.

Read Also : Saroja Devi : సన్యాసిగా మారాలనుకుని.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సరోజా దేవి

ఇందులో హీరోయిన్ ను చూపించలేదు గానీ.. కిరణ్ పాత్రను పరిచయం చేశారు. రిచ్ గా బతకాలనే ఆశతో ఉన్న నాటు కుర్రాడి జీవితాన్ని ఇందులో చూపించబోతున్నట్టు గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. ఈ నడుమ కిరణ్‌ ప్లాపులతో సతమతం అవుతున్నాడు. కాబట్టి ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. రాజేష్ దండా, శివ బొమ్మక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also : Medak Murders: కలకలం సృష్టిస్తున్న చేతబడి హత్యలు.. అనుమానంతో తోడబుట్టిన వాళ్లనే..

Exit mobile version