Jyotika: సూర్య భార్య ఇంత ఘోరంగా అవి చేయడానికి కారణం ఏంటో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyotika: రా.. రా.. సరసకు రారా అంటూ చారడేసి కళ్ళతో భయపెట్టినా.. ఓ.. వాలుకళ్ల వయ్యారి.. తేనెకళ్ల సింగారి అంటూ వయ్యారాలు పోయినా.. జ్యోతికక చెల్లుతుంది. కోలీవుడ్ లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జ్యో.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఇక పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన జ్యోతిక పిల్లలు పెద్దవారు అయ్యాకా మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూ మంచి విజయాలనే అందుకుంది. ఇంకోపక్క భర్త సూర్యతో కలిసి నిర్మాతగా మారి.. మంచి సినిమాలను నిర్మిస్తోంది. ఇక ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది జ్యోతిక. మంచి పాత్రలు రావడానికి.. ఆమె తనవంతు కష్టం పడుతుంది. బాడీ ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటూ చెమటోడుస్తుంది. ఇప్పటికే జ్యోతిక జిమ్ లో భారీ భారీ వర్క్ అవుట్స్ చేస్తున్న వీడియోలు బయటికి వచ్చి అభిమానులు షాక్ అయ్యేలా చేశాయి.
Amala Akkineni: ఏజెంట్ లో కొన్ని లోపాలున్నాయి.. కొడుకు సినిమాపై అమల షాకింగ్ కామెంట్స్
Also Read
ఇక తాజాగా జ్యోతిక కఠోర వ్యాయామం చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అది చూస్తే అబ్బాయిలకు సైతం కొన్ని నిముషాలు ఒళ్ళు జలదిరించడం ఖాయమని తెలుస్తోంది. గోడపై రెండు కాళ్ళు పెట్టి.. చేతులను కింద బాల మీద ఆనించి, శరీరాన్ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతూ బాల్ తో కసరత్తులు చేస్తోంది. ఒక్క గోడ మీదనే కాకుండా.. బాక్సింగ్ బ్యాగ్, మెట్ల మీద, ఇంటి వద్ద గోడ మీద.. కాళ్ళు పెట్టి శరీరాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటుంది. నిజానికి ఇదంత ఈజీయేమి కాదు. కొద్దిగా బ్యాలెన్స్ తప్పినా దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. అలాంటి ఆసనాన్ని జ్యోతిక అవలీలగా చేసేస్తూ కనిపించింది. ఇక ఈ విడియో చూసిన వారందరు ఔరా అని నోళ్లు నొక్కుకుంటున్నారు. ఆమె వయస్సు 44.. ఇద్దరు పిల్లల తల్లి. ఈ వయస్సులో జ్యోతిక ఇంత ఘోరంగా వర్క్ అవుట్స్ చేయడానికి కారణం ఏంటి.. ? అంటే.. ఆమె తన తదుపరి సినిమా కోసమే అంటున్నారు అభిమానులు. తన సినిమాల కోసం జ్యోతిక చేస్తున్న వర్కౌట్స్ షాకింగ్ గా ఉన్నాయని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?