Jyothi Rai: సాధారణంగా అబ్బాయిలు సీరియల్స్ చూడరు అని అంటూ ఉంటారు కానీ చాలా శాతం వరకు ఎక్కువ మగవారే సీరియల్స్ చూస్తారని ఒక సర్వే ద్వారా తెలిసింది. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా.. సినిమా హీరోయిన్స్ మీదనే కాకుండా సీరియల్ హీరోయిన్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి జ్యోతి రాయ్. ఈ ఒక్క పాత్రతోనే ఆమె కన్నడలో సంపాదించుకోలేని పేరును దక్కించుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి- వసుధార ఎంత ఫేమస్ అయ్యారో.. జగతి పాత్ర కూడా అంతే ఫేమస్ అయ్యింది. ఇక కొన్నిరోజుల క్రితమే ఆమె ఒక డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ మొదలుపెట్టింది.
గత కొన్ని రోజుల నుంచి జ్యోతి రాయ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది. ఇక మాట రాని మౌనమిది, శుక్ర సినిమాల డైరెక్టర్ సుకు పుర్వాజ్ ను జ్యోతి రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత అమ్మడు మరింత రెచ్చిపోతుంది. వరుస సినిమా అవకాశాలు రావడంతో.. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును రెచ్చగోడుతుంది. ఇక ఉన్నాకొద్దిగా అమ్మడి బట్టల సైజ్ తగ్గుతూ వస్తుంది. తాజాగా జ్యోతి.. మినీ స్కర్ట్ లో మత్తెక్కిస్తోంది. జీబ్రా చారల డ్రెస్.. థైస్ ను ఎలివేట్ చేస్తుండగా.. చేతులు పైకెత్తి అమ్మడు ఎద అందాలను ఆరబోసింది. ఇక ఇది చూసిన అభిమానులు జగతి ఆంటీ.. రోజు రోజుకు బట్టల సైజ్ తగ్గిస్తే ఎలా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి జ్యోతి తన సినిమాలతో ఎలాంటి హిట్స్ ను అందుకుంటుందో చూడాలి.