Site icon NTV Telugu

Junaid Khan: హిజ్రాగా మారుతున్న స్టార్ హీరో కొడుకు..?

Junaid

Junaid

Junaid Khan: చిత్ర పరిశ్రమలో నెపోటిజం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో అయితే అస్సలు చెప్పనవసరం కూడా లేదు. వాళ్ళు పుట్టినప్పుడే హీరోలుగా మారిపోతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ లో మరో స్టార్ హీరో కొడుకు చక్రం తిప్పడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడును జునైద్ ఖాన్ ఇండస్ట్రీకి పరిచయం కానున్న విషయం తెల్సిందే. అమీర్ ఖాన్, అతడి మాజీ భార్య రీనా దత్తా కుమారుడు జునైద్ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అందుకోసమే ప్రస్తుతం జునైద్ థియేటర్ ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకుంటూనే.. ఇంకోపక్క నాటకాల్లో ఆరితేరుతున్నాడు. ఇక తాజాగా ఒక నాటకం కోసం ఆసక్తికరమైన పాత్రను పోషించనున్నాడని తెలుస్తోంది. అదే హిజ్రా పాత్ర. స్ట్రిక్ట్‌లీ అన్‌కన్వెన్షనల్ అనే నాటకంలో జునైద్ హిజ్రా పాత్రలో కనిపించబోతున్నాడట.

Payal Rajput : నా కెరీర్ లో ఆ సినిమా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గా మిగిలిపోయింది…

15 నవంబర్ 2023 సాయంత్రం ముంబైలోని పృథ్వీ థియేటర్‌లో తొలి ప్రదర్శనకు సిద్దమవుతుంది. స్టార్ హీరో కొడుకు.. ఇప్పటికే మంచి మంచి నాటకాలతో స్టేజిపై అలరించాడు. ఇక ఇప్పుడు ఇలాంటి నాటకంతో రెడీ అవుతుండడంతో అభిమానులు దీనికోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి పాత్ర అని తెలియడంతో ఎలా నటిస్తాడా.. ? అని ఎంతో ఆత్రుతగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నాటకం కనుక హిట్ అయితే.. జునైద్ నటన గురించి డౌట్స్ ఉండనే ఉండవు. మరి అమీర్ ఖాన్ కొడుకు.. ఎలా ఈ హిజ్రా పాత్రలో ఒదిగిపోతాడో చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Exit mobile version