Julakanti Brahmananda Reddy Met Balakrishna: నందమూరి బాలకృష్ణ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క పాలిటిక్స్ కూడా చేస్తున్న ఆయన ఈ మధ్యనే మూడవ సారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాతల మండలి ప్రతినిధులు నందమూరి బాలకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్‌కు బాలయ్య ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించినందుకు వారు శుభాకాంక్షలు తెలిపారు. మొన్న ఈమధ్యనే జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటిచేసి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే హిందూపురం నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య తాజాగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. ఇంకోపక్క బాలయ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. దీంతో టాలీవుడ్ నిర్మాతల మండలి, తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇందులో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, ఈసీ మెంబర్ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు), తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె. అనుపం రెడ్డి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి తదితరులు ఉన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాలకృష్ణను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి కలిశారు. ప్రస్తుతం బాలయ్య విజయవాడలో ఉన్నారు. ఈ క్రమంలో జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మర్యాద పూర్వకంగా ఆయనని కలిసినట్టు చెబుతున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి మీద జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గట్టి మెజారిటీతో గెలిచారు.