ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొమరం భీమ్ పాత్రలో తారక్ నటించాడు అనడం కన్న జీవించాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న తారక్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ తో చేస్తున్న విషయం తెల్సిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే కొమరం భీమ్ కోసం కొద్దిగా ఒళ్ళు చేసిన తారక్ కొరటాల శివ సినిమా కోసం స్లిమ్ కానున్నాడు. దీనికోసం మరోసారి జిమ్ లో కష్టపడుతున్నాడు.
స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఫిట్ గా ఉండాలని, అందుకోసం తారక్ స్లిమ్ అవ్వాలని కొరటాల సూచించడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం స్లిమ్ అయ్యే పామిలో పడ్డాడట. ఇక తాజాగా ఎన్టీఆర్ లుక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ కొద్దిగా స్లిమ్ అయ్యినట్లు కనిపిస్తున్నాడు. ట్రిమ్ చేసిన గడ్డంతో అల్ట్రా స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే తారక్ సన్నబడి మరింత స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఇకపొతే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె, ఎన్టీఆర్సరసన నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మరి అందులో నిజమెంత అనేది తెలియాలి.
