‘ఆంధ్రావాలా’ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించిన తారక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అంటే పడిచచ్చే డైహార్డ్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా రేంజ్ లో ఫాలోవర్స్ ను సంపాదించుకునే పనిలో ఉన్నారు తారక్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో బాలీవుడ్ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నట్టు వెల్లడైంది. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా పలు బిటౌన్ పాపులర్ షోలలో పాల్గొన్న విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ప్రముఖ హిందీ కామెడీ టాక్ షో ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్న ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
తన 2004 చిత్రం ఆంధ్రావాలా ఆడియో లాంచ్‌కు సుమారు 10 లక్షల మంది అభిమానులు హాజరయ్యారని తెలిపారు. పెరుగుతున్న కోవిడ్-19 కేసులు, దాని పర్యవసానంగా దేశవ్యాప్తంగా థియేటర్లు మూసివేయడం వల్ల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమ చిత్రం విడుదల వాయిదా పడినట్లు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. అయితే దీనికి ముందు చిత్రనిర్మాత రాజమౌళితో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ ఈ కల్పిత పీరియాడికల్ డ్రామాను బాగా ప్రమోట్ చేశారు. అదే కారణంతో వారు కపిల్ శర్మ షో వేదికపై కూడా కన్పించారు. ఈ ఎపిసోడ్ నిన్న రాత్రి టెలివిజన్‌లో ప్రసారమైంది.
Also Read
Read Also : పిక్ : మాల్దీవుల్లో మెర్మైడ్… మెస్మరైజ్ చేస్తున్న దిశా
ఈ షో ఇంటరాక్షన్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్‌లకు భారీ సంఖ్యలో అభిమానులు ఎలా వస్తారో హోస్ట్ కపిల్ శర్మ ప్రస్తావించారు. జూనియర్ ఎన్టీఆర్ 2004 చిత్రం ‘ఆంధ్రావాలా’ ఆడియో లాంచ్‌కు వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఎలా చేసిందో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అభిమానుల సంఖ్య గురించి తారక్ ని అడిగినప్పుడు, సినిమా ఆడియో లాంచ్‌కు దాదాపు 9 నుండి 10 లక్షల మంది అభిమానులు వచ్చారని, దాని కోసం ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర విషయాన్నీ వెల్లడించారు. దీని గురించి తెలుసుకున్న అలియా భట్ అవాక్కయ్యారు.
2004లో వచ్చిన “ఆంధ్రావాలా” చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. జూనియర్ ఎన్టీఆర్, రక్షిత, సాయాజీ షిండే, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!