పిక్ : మాల్దీవుల్లో మెర్మైడ్… మెస్మరైజ్ చేస్తున్న దిశా

దిశా పటాని… పేరు వింటేనే కుర్రకారుకు అందాల విందు గుర్తొస్తుంది. ఈ బాలీవుడ్ బార్బీ అందాలను దాచుకోవడానికి ఏమాత్రం ఇష్టపదు… ఆ అందాన్ని ఫోటోల రూపంలో బంధించి తన అభిమానులకు కిక్ ఇవ్వడానికి అంతకన్నా వెనుకాడదు. తాజాగా దిశా తన ఇన్‌స్టాలో బికినీలో సముద్రంలో అందమైన పిక్ ను పంచుకుంది. దిశా షేర్ చేసిన ఫోటోలో ఆమె పూర్తిగా మెర్మైడ్ లా మారి మెస్మరైజ్ చేస్తోంది. మెరిసే సముద్రం, స్పష్టమైన ఆ మాల్దీవుల సముద్రపు నీటిలో దిశ ఫోటోలకు పోజులిచ్చిన తీరు కనువిందుగా ఉంది.

Read Also : టికెట్ రేట్ల ఇష్యూ… ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ ప్రశ్నల వర్షం

ఈ అథ్లెటిక్ ఫిగర్ బేబీ పింక్ బికినీని ధరించింది. అందులో ఆమె మరింత అందంగా కనిపించింది. ఇక ఇటీవలి ఊహాగానాల ప్రకారం ప్రేమ పక్షులు టైగర్ ష్రాఫ్, దిశా పటానీ కొత్త సంవత్సరాన్ని మాల్దీవుల్లో సెలెబ్రేట్ చేసుకుని కిక్‌స్టార్ట్ చేశారు. ఇక దిశా సినిమాల విషయానికొస్తే… సిద్దార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నాలతో కలిసి ‘యోధ’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ విషయాన్ని కరణ్ జోహార్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం నవంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

పిక్ : మాల్దీవుల్లో మెర్మైడ్… మెస్మరైజ్ చేస్తున్న దిశా
పిక్ : మాల్దీవుల్లో మెర్మైడ్… మెస్మరైజ్ చేస్తున్న దిశా

Related Articles

Latest Articles