Site icon NTV Telugu

HBD Ram Charan : ఎన్టీఆర్ ఇంట్లో బర్త్ డే సెలబ్రేషన్స్… పిక్ వైరల్

Ram-Charan-and-NTR

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా సంవత్సరాలుగా స్నేహితులు అన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఈరోజు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా తారక్ తన ఇంట్లో చెర్రీ కోసం ప్రత్యేకమైన పుట్టినరోజు వేడుకను నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అఖిల్ అక్కినేనితో పాటు పలువురు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నేడు చెర్రీకి అభిమానులు, సెలెబ్రిటీల నుంచి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు చెర్రీ అభిమానులు రామ్ చరణ్ కటౌట్లకు పాలాభిషేకాలు, అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Read Also : KGF Chapter 2 : తెలుగు ట్రైలర్ రిలీజ్ చేయనున్న రామ్ చరణ్

ఇదిలా ఉండగా ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన మ్యాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్”కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాతో చెర్రీకి అద్భుతమైన పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చాడు జక్కన్న. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో జూనియర్ ఎన్టీఆర్ గోండు గిరిజనుడైన భీమ్‌గా నటించగా, రామ్ చరణ్ రామరాజు అనే పోలీసు అధికారిగా నటించాడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది.

Exit mobile version