WAR 2 Pre Release Event : ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. తాను వార్-2 సినిమా ఎందుకు చేశానో తెలిపారు. నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా. తనను నమ్మమని అన్నాడు. మన అభిమానులు గర్వించేలా నన్ను చూపిస్తా అని ప్రామిస్ చేశాడు. ఎన్నో సార్లు నా వెంట పడి నచ్చజెప్పి ఈ సినిమాలో నటించేలా చేశాడు. ఆయన చెప్పిన మాట వినకపోతే ఈ రోజు ఇంత గొప్ప సినిమాను మిస్ అయ్యేవాడిని. నేను యష్ రాజ్ ఫిలింస్ కు స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. ముంబై వెళ్లినప్పుడు నన్ను సొంత ఇంట్లో ఉన్నట్టే చూసుకున్నారు. నా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
Read Also : WAR 2 Pre Release Event : ఎన్టీఆర్ నాకు తమ్ముడు.. సింగిల్ టేక్ యాక్టర్.. హృతిక్ ప్రశంసలు
నేను బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా రావాలి. కానీ అనుకోకుండా రాలేకపోయాను. అప్పుడు ఆయన్ కూడా హైదరాబాద్ రాలేదు. కానీ ఈ రోజు నా సినిమా డైరెక్టర్ గా ఇక్కడకు వచ్చాడు. నిజంగా డెస్టినీ అంటే ఇదే అంటూ తెలిపాడు తారక్. వార్-2 తీయడానికి అయాన్ కంటే ఇంకెవరూ ఆప్షన్ లేరు. సినిమా చూశాక మీకే అనిపిస్తుంది. ఇద్దరు స్టార్స్ ను పెట్టుకుని హ్యాండిల్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఆ కష్టం మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. అతను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. అయాన్ మీకు ప్రామిస్ చేస్తున్నా.. 2025లో మనం గొప్ప సినిమాను రిలీజ్ చేస్తున్నాం. మీ పేరు దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది అంటూ తెలిపాడు జూనియర్ ఎన్టీఆర్.
Read Also : War 2 Pre Release Event : వార్-2 పక్కా తెలుగు సినిమానే.. డబ్బింగ్ కాదు : నాగవంశీ
