NTV Telugu Site icon

SIIMA 2023: బెస్ట్ యాక్టర్ అవార్డు బరిలో చరణ్, ఎన్టీఆర్.. ఎవరికిచ్చినా రచ్చ తప్పదుగా!

Ntr Charan

Ntr Charan

SIIMA 2023 Best Actor in a Leading Role: ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్‌ రేంజ్‌ను అందుకున్న హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ అభిమానుల మధ్య మరోసారి రచ్చ మొదలు కానుంది. నిజానికి ఈ సినిమా మొదలు కాక ముందు ఈ ఇద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉందొ తెలియదు కానీ మంచి స్నేహితులని ఈ సినిమా చాటింది. ఇక ఈ సినిమా మొదలైనప్పటి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ జరిగింది. మా వాడు గొప్ప అంటే మా వాడు గొప్ప అని అప్పట్లో ఫ్యాన్ వార్స్ కి దిగారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ అభిమానుల మధ్య మరో సారి యుద్ధం మొదలవనుంది. అది భీకరంగా.. భయంకరంగా సాగనుందని కేవలం సోషల్ మీడియానే కాదు ఇండస్ట్రీని కూడా ఆ యుద్ధం హడలెత్తించనుందని అంటున్నారు.

Tamannaah: ఆ సీన్లకి ఒప్పుకోకపోతే అక్కని, ఆంటీని చేసేవారు..తమన్నా ఏంటి ఇలా అనేసింది!

ఎన్టీఆర్, చరణ్‌లు కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఏకంగా ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించాడు రాజమౌళి. దాంతో చరణ్, తారక్‌ ఇద్దరు గ్లోబల్ స్టార్ డమ్ అందుకున్నారు. ఇప్పుడు ఎవరి సినిమా లైనప్స్‌తో.. వారు బిజీగా ఉన్న వేళ సైమా – సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఓ నామినేషన్‌ రిలీజ్‌ చేసింది. బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ లీడింగ్ రోల్గా ఓ యాక్టర్‌ను ఎన్నుకోవాలని తమ సోషల్ మీడియా హ్యాండిల్లో అఫీషియల్ సైట్స్‌లో పోస్ట్ రిలీజ్ చేసింది. మేజర్ సినిమాలో అడవి శేష్‌, సీతా రామలో దుల్కర్ సల్మాన్, కార్తికేయ2లో నిఖిల్ సిద్ధార్త్‌, డీజె టిల్లు లో జొన్నల గడ్డకూ నామినేట్ అయ్యారు. ఇక ట్రిపుల్ ఆర్‌లో రామ్ చరణ్‌, అండ్ ఎన్టీఆర్ ఇద్దరినీ నామినేట్ చేసి ఈ 6 గురు హీరోల్లో బెస్ట్ యాక్టర్‌కు ఓటు వేయండి అని తమ పోస్టుల్లో .. సైట్స్‌లో కోట్ చేసింది. దీంతో ఈ ఇద్దరు అభిమానుల మధ్య మరోమారు రచ్చ మొదలు కానుందని అంటున్నారు.

Show comments