Akkineni Nagarjuna: సూపర్ స్టార్ కృష్ణ వారం క్రితం మృతి చెందిన విషయం విదితమే. ఇక తమ అభిమాన హీరోను కడసారి చూడడానికి అభిమాన హీరోలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్గజాలు మొత్తం కృష్ణను చివరి చూపును చూసుకోవడానికి వచ్చారు.. ఒక్క నాగార్జున తప్ప. నాగ్ కు కృష్ణతో విడదీయరాని అనుబంధం ఉంది. అయినా కృష్ణను చూడడానికి ఎందుకు రాలేదని అందరు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ అనుమానానికి ఆన్సర్ చెప్పాడు ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ ” చాలా దగ్గర అనుబంధం ఉన్నవారు చనిపోతే చాలామంది వారి వద్దకు వెళ్ళడానికి భయపడతారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నాగార్జున. ఆయనతో ఎంతో అనుబంధం ఉన్న ఈవివి సత్యనారాయణ, దాసరి నారాయణరావు గారు చనిపోయిన సమయంలో కూడా రాలేదు. సాధారణంగా బాగా దగ్గర వారు చనిపోయినప్పుడు కొంతమంది ఆ బాధను తట్టుకోలేరు. నాగ్ కూడా ఆ బాధను తట్టుకోలేక కృష్ణ చివరి చూపుకు రాలేదు అంతేకాని వారి మధ్య విబేధాలు ఏమి లేవని” చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.