రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండడం భయాందోళనలను కలిగిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమలో కరోనా చాప కింద నీరులా పాకుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కరోనా బారిన పడింది. బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ‘జెర్సీ’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ కరోనా బారిన పడింది. అందుతున్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్ లో చికిత్స తీసుకొంటున్నారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నారు.
‘జెర్సీ’ హీరోయిన్ కి ఒమిక్రాన్..?

mrunal thakur