Site icon NTV Telugu

Thug Life: కమల్- మణిరత్నం ‘సినిమా’ కష్టాలు!

Thug Life

Thug Life

Jayam Ravi Exits Kamal Hassan’s Thug Life after Dulquer Salman: తమిళంలో పొన్నియన్ సెల్వన్ సిరీస్ విజయం తర్వాత , మణిరత్నం 25 సంవత్సరాల తర్వాత ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ‘థగ్ లైఫ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు జయం రవి, దుల్కర్ సల్మాన్ అలాగే త్రిష కూడా నటిస్తారని గతంలో ప్రకటించారు. ఈ అందరితో కలిసి ఒక హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామా సినిమాగా దీన్ని మలుస్తారని ప్రచారం కూడా జరిగింది. 1987లో ఒక ఊపు ఊపిన ఈ నాయకన్ కాంబో ఎప్పుడెప్పుడు తెర మీదకు వస్తుందా? అని అభిమానులు మరియు ప్రేక్షకులు ఉత్సాహంగా ఉండగా ఈ సినిమాకి మాత్రం వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవలి కాలంలో డేట్ సమస్యల కారణంగా దుల్కర్ సల్మాన్ ఈ ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించాడు ఆయన స్థానంలో శింబుని తీసుకున్నట్లు సమాచారం.

Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం కొత్త సాంగ్ వచ్చేసింది.. డీజే కొట్టు మావా

ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏంటంటే.. జయం రవి కూడా డేట్స్ కుదరడం లేదని చెబుతూ ఈ సినిమా నుంచి వైదొలిగాడని అంటున్నారు. నిజానికి. రవి మరియు దుల్కర్ ఇద్దరికీ ఈ సినిమాలో కీలకమైన పాత్రలు. ఇప్పుడు ఆ ఇద్దరూ తప్పుకోవడం సినిమా మేకర్స్‌కు భారీ కుదుపు అనే చెప్పాలి. ఇక మరోవైపు, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సీజన్ కారణంగా ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న కమల్ హసన్ సినిమా నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశారని, మే 2024లో షూట్ తిరిగి ప్రారంభమవుతుందని భావిస్తున్నారని అంటున్నారు. మరి జయం రవి తప్పుకుంటే ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు? అనేది కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఇక సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు పాటలను కంపోజ్ చేయడం AR రెహమాన్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

Exit mobile version