Balakrishna: తెలుగు జాతికి నిత్య స్మరణీయుడు ఎన్.టి.ఆర్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: “నాన్నగారు ఎన్టీయార్ శతజయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆయన ప్రభావం, ప్రాభవం ఇప్పటికీ తెలుగు జాతికి స్ఫూర్తినిస్తుందనటానికి ఇదే నిదర్శనం” అని అన్నారు నందమూరి బాలకృష్ణ. ఎన్ .టి .ఆర్. శత జయంతి వేడుకల కమిటీ చైర్మన్ టి. డి. జనార్థన్ సారధ్యంలో నందమూరి బాలకృష్ణతో కమిటీ సభ్యులు ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిటీ చేస్తున్న కృషిని జనార్దన్ బాలకృష్ణకు వివరించారు.
ఎన్.టి.ఆర్. శతజయంతి సంవత్సరంలో ఆయన తరతరాలకు గుర్తుండిపోయేలా తమ కమిటీ గత ఆరు నెలలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోందని బాలకృష్ణకు జనార్దన్ చెప్పారు. ‘జయహో ఎన్.టి.ఆర్.’ పేరుతో వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో రామారావు గారికి సంబంధించిన వ్యాసాలు, వీడియోలు ఉంటాయని, అలాగే రామారావు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, బయట చేసిన ప్రసంగాలను రెండు పుస్తకాలుగా తీసుకొస్తున్నామని, ‘శకపురుషుడు’ పేరుతో ఒక ప్రత్యేక సంచిక రూపకల్పన చేస్తున్నామని, ఇందులో రామారావు సినిమా, రాజకీయ జీవితంపై విశ్లేషణాత్మక వ్యాసాలు, అపురూపు, అరుదైన ఛాయా చిత్రాలు ఉంటాయ’ని జనార్దన్ తెలిపారు. ఎన్.టి.ఆర్. శత జయంతి వేడుకలను విజయవాడ, హైదరాబాద్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జనార్దన్ చెప్పారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ, “మా తండ్రే నాకు స్ఫూర్తి ప్రదాత.ఆయన మార్గంలోనే నేనూ ప్రయాణిస్తున్నాను. మా తండ్రిగారు సినిమా రంగంలో సాధించిన విజయాలు, చేసిన వినూత్న ప్రయోగాలు, ముఖ్యమంత్రిగా ప్రజల అభ్యున్నతికి ఆయన చేపట్టిన పథకాలు ఈనాడు దేశమంతా అమలవుతున్నాయి. దీని ద్వారా ఆయన దూరదృష్టి ఎలాంటిదో ఇప్పటి తరాలకు తెలుస్తోంది. వారిని ఎప్పటికీ ప్రజలు గుర్తుంచుకునేలా మీరు చేస్తున్న అసామాన్యమైన కృషికి కృతజ్ఞతలు. మేం కూడా ఈ కృషిలో భాగస్వాములమవుతాం” అని హామీ ఇచ్చారు. బాలకృష్ణను కలిసిన వారిలో చైర్మన్ టి. డి. జనార్థన్, సభ్యులు కాట్రగడ్డ ప్రసాద్, భగీరథ, విక్రమ్ పూల, అట్లూరి నారాయణరావు, డి. రామ్ మోహన్ రావు, మండవ సతీష్, కె. రఘురామ్, శ్రీపతి సతీష్ తో పాటు విజయ్ భాస్కర్, గౌతమ్ బాలకృష్ణ తదితరులు ఉన్నారు.
Also Read
- Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ 'పార్వేట'
- Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
- Spirit : 'స్పిరిట్' ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తాజావార్తలు
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్‌లకు గట్టి పోటీ
-
Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్‌పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!