విజయ్ దేవరకొండ హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఒక భారీ ప్రాజెక్ట్ చేసేందుకు కథ సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలాకాలం క్రితమే దిల్ రాజు బ్యానర్లో “జటాయు” అనే సినిమా చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో భారీ వీఎఫ్‌ఎక్స్ (VFX) తో కూడిన సబ్జెక్టుగా సిద్ధం చేశారు. అయితే, ఎందుకో ఈ సినిమా అప్పటినుంచి ముందుకు వెళ్లలేదు. కొన్ని నెలల క్రితం, ఈ సబ్జెక్టు హీరో, డైరెక్టర్ మారారని, ప్రభాస్ హీరోగా మరొక పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్‌తో ఈ సినిమా చేయాలని దిల్ రాజు భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, అవి కూడా వార్తలుగానే మిగిలిపోయాయి.
Also Read : Trivikram – Venkatesh : త్రివిక్రమ్ – వెంకటేశ్ హిట్ కలయికకు మరో స్టార్ హీరోయిన్!
అయితే, ఇప్పుడు తాజాగా ఈ సినిమాని శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా రూపొందించడానికి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే, విజయ్ దేవరకొండ, ప్రభాస్ లాంటి హీరోలతో చేయాలనుకున్న సినిమాని పెద్దగా మార్కెట్ లేని శ్రీకాంత్ కొడుకుతో చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజ్ అయితే ఈ ప్రాజెక్టు రోషన్‌తో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని అంటున్నారు. అందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా సంబంధించిన అధికారిక ప్రకటన వస్తే తప్ప ఆ వార్తలు నిజమా కాదా అనేది చెప్పలేని పరిస్థితి.